iDreamPost
android-app
ios-app

Pic Talk: ఈ ఫొటోలో ఉన్న బుగ్గల చిన్నారి.. ఇప్పుడు నాజూకు బ్యూటీ! స్టార్ హీరోయిన్!

  • Published Apr 13, 2024 | 9:19 PM Updated Updated Apr 13, 2024 | 9:19 PM

సెలెబ్రిటీల చిన్ననాటి ఫోటోల ట్రెండ్ సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరొక బూరె బుగ్గల చిన్నారి ఫోటో ఈ ట్రెండ్ లోకి వచ్చేసింది. మరి, ఈ చిన్నారి ఎవరో గెస్ చేసేద్దాం.

సెలెబ్రిటీల చిన్ననాటి ఫోటోల ట్రెండ్ సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరొక బూరె బుగ్గల చిన్నారి ఫోటో ఈ ట్రెండ్ లోకి వచ్చేసింది. మరి, ఈ చిన్నారి ఎవరో గెస్ చేసేద్దాం.

  • Published Apr 13, 2024 | 9:19 PMUpdated Apr 13, 2024 | 9:19 PM
Pic Talk: ఈ ఫొటోలో ఉన్న బుగ్గల చిన్నారి.. ఇప్పుడు నాజూకు బ్యూటీ! స్టార్ హీరోయిన్!

సోషల్ మీడియాలో ఇప్పుడు కొనసాగుతున్న అనేక ట్రెండ్స్ లో.. సెలెబ్రిటీల చిన్న నాటి ఫోటోల ట్రెండ్ ఒకటి. ఇప్పుడు ఇండస్ట్రీని ఎంతో మంది సినీ తారలు.. చిన్నపుడు ఎలా ఉంటారో తెలుసుకోవాలని వారి అభిమానులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తూ ఉంటున్నారు. దీనితో ఒకరి తర్వాత ఒకరుగా గెస్ మీ అంటూ.. సోషల్ మీడియా ట్రెండ్ లోకి వచ్చేస్తున్నారు సినీ తారలు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ వచ్చేశాయి. ఇక ఇప్పుడు ఓ బూరె బుగ్గల చిన్నారి ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఈమె అందరికి బాగా పరిచయం ఉన్న నటి.. కానీ తెలుగులో తీసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. మరి ఆ నటి ఎవరో.. ఇప్పుడు ఏం చేస్తుందో గెస్ చేసేద్దాం.

చాలా మంది నటి నటులు తెలుగులో తీసిన సినిమాలు తక్కువైనా కానీ, తెలుగు ప్రేక్షకులను మెప్పించే తీరు మాత్రం విభిన్నంగా ఉంటుంది. అందులోను ఇప్పుడు మలయాళ భామలు తెలుగు వారి మదిలో సంపాదించుకుంటున్న స్థానం అంత ఇంతా కాదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ముద్దుగుమ్మ కూడా ఈ కోవకు చెందిందే. మలయాళ, తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ.. తన అందంతో.. క్యూట్ నెస్ తో.. వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను.. సంపాదించుకుంది ఈ చిన్నది. అల్లరి చేస్తూ సినిమాలలో కనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో కూడా తన ప్రతిభ కనబరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా యూత్ అంతా ఈమె నటనకు, అందానికి.. అల్లరికి ఫిదా అయిపోతుంటారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయం అయినా కూడా.. ఈమె మాత్రం తెలుగు వారి మదిలో మంచి మార్కులే కొట్టేసింది. ఆమె మరెవరో కాదు రాజా రాణి సినిమాతో అందరి మన్ననలు పొందిన నజ్రియా నజీమ్.

నజ్రియా నజీమ్ చైల్డ్ యాక్టర్ గానే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక టీవీ షో కు హోస్ట్ గా కూడా చేసింది. క్రమంగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళ సినిమా అయినా బెంగళూర్ డేస్ మూవీ తో అటు మళయాళీలనే కాకుండా తెలుగువారిని కూడా కట్టిపడేసింది. అటు మలయాళ, తెలుగు సినిమాలు చేస్తూనే.. తెలుగులో న్యాచురల్ స్టార్ నానికి జోడిగా.. “అంటే సుందరానికి” సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆమె భర్త ఫహద్ ఫాజిల్ కూడా సినిమాలలో అందరికి సుపరిచితుడే. ఇక నజ్రియా కూడా సినిమాలను చాలా సెలెక్టివ్ గా చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఈ అమ్మడు సూర్య 43వ చిత్రం కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి, తెలుగులో నజ్రియా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందనేది మాత్రం క్లారిటీ లేదు. మరి, నజ్రియా నజీమ్ చిన్న నాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş