iDreamPost
android-app
ios-app

నయనతారపై ఆ నిర్మాత సంచలన కామెంట్స్! అర్థరాత్రి అలా చేసేది అంటూ!

  • Published Jun 12, 2024 | 2:21 PM Updated Updated Jun 12, 2024 | 2:21 PM

Nayanthara.. లేడీ సూపర్ స్టార్ నయన తార తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. వివాదాలు ఆమెకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇప్పుడు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశాడో నిర్మాత.

Nayanthara.. లేడీ సూపర్ స్టార్ నయన తార తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. వివాదాలు ఆమెకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇప్పుడు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశాడో నిర్మాత.

  • Published Jun 12, 2024 | 2:21 PMUpdated Jun 12, 2024 | 2:21 PM
నయనతారపై ఆ నిర్మాత సంచలన కామెంట్స్! అర్థరాత్రి అలా చేసేది అంటూ!

యాంకర్‌గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి.. ఈ రోజు సినీ రంగంలో స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతుంది నయనతార. దక్షిణాది ఇండస్ట్రీని మడతపెట్టేసి.. ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమలో కూడా తన హవా కొనసాగించేందుకు ప్రిపేర్ అవుతుంది. పెళ్లై, పిల్లలు పుట్టాక మరింత జోరు పెంచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఇంచుమించు పది నిమిషాలున్నాయి. అంత బిజీ లైఫ్ లోకూడా కుటుంబానికి సమయం కేటాయిస్తూ ఉంటుంది. ఇప్పటికే 75 సినిమాలు పూర్తి చేసిన ఈ లేడీ సూపర్ స్టార్.. ఇటీవల కాలంలో హీరోయిన్ ఓరియెంట్ చిత్రాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా పిల్లలు, భర్తతో సమయం గడుపుతుంది.ఇటీవల నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు తమ పిల్లలతో కలిసి చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సంగతి విదితమే.

అయితే నిత్యం ఏదో ఒక విషయంలో వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది నయన్.  తాజాగా ప్రముఖ నిర్మాత అనంతనన్ ఆమెపై షాకింగ్ ఆరోపణలు చేశాడు. నయనతార గతంలో తాను నివసించే ఓ అపార్ట్ మెంట్‌లో రచ్చ రచ్చ చేసిందని, పెద్ద తలనొప్పి సృష్టించిందని అంటున్నాడు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నయన్-విక్కీ దంపతులకు మగపిల్లలు ఉన్న సంగతి విదితమే. సరోగసీ ద్వారా వీరికి జన్మనిచ్చారు. అయితే.. నయనతార చెన్నైలోని ఎగ్మోర్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించినప్పుడు.. ఆడుకోవడానికి పిల్లల్ని కిందకు తీసుకు వచ్చేది. అలా ఓ రోజు తీసుకురాగా, ఓ ఆటో డ్రైవర్ రైడ్ కోసం అక్కడకు వచ్చాడు. అయితే పిల్లలు ఆడుకునే ఏరియాలో ఇంత వేగంగా ఆటో తీసుకువస్తున్నావేమిటీ అంటూ అతడితో గొడవ పడిందట.

అంతే కాకుండా ఒకసారి ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తితో కూడా ఫోనులో గట్టిగా అరిచిందట. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసే విషయంలో కూడా గొడవ పడిందట. ఇతర అపార్ట్ మెంట్ వాసులకు ఆమె చర్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. అర్థరాత్రి సమయాల్లో కూడా బిగ్గరగా అరిచేదట. దీంతో అసోసియేషన్‌లో నయన్ పై దాదాపు 50 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.దీంతో ఆమెను ఖాళీ చేయాలని చెప్పడంతో అక్కడి అపార్ట్ మెంట్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈ లేడీ సూపర్ స్టార్ చెన్నై పోయెస్ గార్డెన్‌లో భారీ బంగ్లా నిర్మించి అక్కడే స్థిరపడింది. అంతనన్ చెబుతున్న మాటలు చూస్తుంటే.. అపార్ట్‌మెంట్‌లో తరచూ గొడవలు జరుగుతుండటంతో నటి నయనతార అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసిందా అనే ప్రశ్న మొదలవుతోంది. కాగా, అంతనన్ వ్యాఖ్యలపై నెటిజన్లు.. ఇదంతా నయనే చేసిందా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంత మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. మరికొంత మంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio