iDreamPost

Nayanathara: ఆ స్టార్ హీరో సినిమాలో నటించడం నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం: నయనతార

స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన షాకింగ్ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఆ స్టార్ హీరో సినిమాలో నటించడం.. నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ చెప్పుకొచ్చింది.

స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన షాకింగ్ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఆ స్టార్ హీరో సినిమాలో నటించడం.. నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ చెప్పుకొచ్చింది.

Nayanathara: ఆ స్టార్ హీరో సినిమాలో నటించడం నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం: నయనతార

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ నటించిన అన్ని సినిమాలు హిట్లు కావు. అందులో కొన్ని సక్సెస్ సాధిస్తే.. మరికొన్ని ఫెయిల్యూర్స్ గా నిలుస్తాయి. ఇక ఆ సినిమాలో నటించడం నాకు ఇష్టం లేదు కానీ చెయ్యాల్సి వచ్చింది అంటూ కొందరు మూవీ విడుదల అయ్యాక స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇక ఇందులో నా పాత్ర ముందు చెప్పిన విధంగా తెరకెక్కించలేదంటూ నటీ, నటులు సంచలన ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన షాకింగ్ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఆ స్టార్ హీరో సినిమాలో నటించడం.. నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ చెప్పుకొచ్చింది. మరి ఆ మూవీ ఏది? ఆ హీరో ఎవరు?

నయనతార.. స్టార్ హీరోయిన్ గా, లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో వెలుగొందుతోంది. తెలుగుతో పాటుగా ఇతర ఇండస్ట్రీల్లో నటిస్తూ.. బిజీగా ఉంది. స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో కూడా మెరుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. 2005లో స్టార్ హీరో సూర్య, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘గజిని’. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇందులో ఆసీస్ హీరోయిన్ గా నటించగా.. నయనతార ఓ కీ రోల్ లో మెరిసింది.

Nayanthara

అయితే గజిని మూవీలో తన పాత్రను ముందు చెప్పిన విధంగా తెరకెక్కించలేదని నయన్ తెలిపింది. దాంతో ఈ సినిమాలో నటించడం నేను తీసుకున్న అతి పెద్ద చెత్త నిర్ణయం అంటూ నయన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఈ విషయంలో నేను ఎవ్వరిని తప్పుబట్టడం లేదు అంటూ పేర్కొంది. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. కెరీర్ ప్రారంభంలో స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో సినిమాల్లో చిన్న రోల్ వచ్చినా సంతోషపడతారు. ఆ తర్వాత స్టార్ హీరో, హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఇలా కామెంట్స్ చేస్తారు అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి గజిని సినిమాలో నటించడంపై నయన్ చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by FilmyScoops | తెలుగు (@filmyscoops)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి