iDreamPost
android-app
ios-app

Nayanatara Marriage నయనతార పెళ్లిలో ఎన్నో ప్రత్యేకతలు

  • Published Jun 07, 2022 | 1:11 PM Updated Updated Jun 07, 2022 | 1:11 PM
  • Published Jun 07, 2022 | 1:11 PMUpdated Jun 07, 2022 | 1:11 PM
Nayanatara Marriage నయనతార పెళ్లిలో ఎన్నో ప్రత్యేకతలు

ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ ప్రేమకథకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎల్లుండి వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ల పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మహాబలిపురం వేదికగా విరాట్ కోహ్లీ, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీ పెళ్లిళ్లు చేసిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపనీతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. చాలా పరిమితంగా అతిథులను పిలవడంతో పాటు వాళ్లకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ని ముందే డిసైడ్ చేసి ఆమేరకు ఆల్రెడీ అందించేశారట. తాళి కట్టే మండపాన్ని పూర్తిగా అద్దాలతో సెట్ చేశారు. అంటే గ్లాస్ హౌస్ లాంటిదన్న మాట.సెలబ్రిటీలు ఎవరెవరొస్తారు అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది

ఈ వేడుక తాలూకు ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చినట్టు చెన్నై టాక్. మాములుగా వీటిని న్యూస్ ఛానల్స్ లో లైవ్ ఇవ్వడం పరిపాటి. అందుకుగాను ఎంతో కొంత మొత్తం నిర్వాహకులకు దక్కుతుంది. కానీ దీన్ని కూడా బిజినెస్ కోణంలో చూసిన నయన్ విగ్నేష్ లు ఇలా డిజిటిల్ స్ట్రీమింగ్ కు ఇవ్వడం ద్వారా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. రాజు తుమ్మినా వేడుకే దగ్గినా వేడుకే అన్నట్టు ఇలాంటి స్టార్ వెడ్డింగ్స్ భవిష్యత్తులో క్యాష్ చేసుకునే కంటెంట్ గా మారిపోవడం దగ్గరలోనే ఉంది. దర్శకుడు గౌతమ్ మీనన్ దీని తాలూకు పర్యవేక్షణ చేయబోతున్నట్టు టాక్. అయితే ఈ డీల్ కు సంబంధించి అఫీషియల్ అప్డేట్ సదరు ఓటిటి ఇవ్వలేదు.

తమిళనాడు సిఎం స్టాలిన్ తో సహా ఎందరో ప్రముఖులను మహాబలిపురంకు ఆహ్వానించారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జునలతో పాటు మరికొందరికి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందట. ఇది నిజమా కాదా చూడాలి. నేను రౌడీనే టైం నుంచి ప్రేమ చిగురించిన నయన్ విగ్నేష్ లు ఇప్పటిదాకా వివాహం ప్రస్తావన వచ్చినప్పుడంతా దాటవేస్తూ వచ్చారు. చివరికి ఆరేళ్ళకు పైగా సాగిన తమ లవ్ స్టోరీకి ఈ రకంగా శుభం కార్డు ఇచ్చేశారు. లేడీ సూపర్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే నయనతార ఇటీవలే భర్త దర్శకత్వంలో కెఆర్కెలో కనిపించింది. మెగాస్టార్ మూవీ గాడ్ ఫాదర్ లోనూ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom