iDreamPost
android-app
ios-app

కల్కి 2 గురించి నవీన్ పోలిశెట్టి హింట్.. అదే నిజమయ్యేలా ఉంది!

  • Published Oct 23, 2024 | 5:35 PM Updated Updated Oct 23, 2024 | 5:35 PM

Naveen Polishetty In Kalki 2 : సరే ప్రభాస్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు . పాన్ ఇండియా కింగ్ , బాక్స్ ఆఫీస్ బాద్షా అబ్బో ఇలా ఒకటా రెండా చాలానే చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారి కాస్త వెనక్కు వెళ్ళి కల్కి గురించి చెప్పుకుంటే ఈ విషయాలు బయటపడతాయి. ఇప్పుడు కల్కి 2వ పార్ట్ లో కొత్త క్యారెక్టర్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.

Naveen Polishetty In Kalki 2 : సరే ప్రభాస్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు . పాన్ ఇండియా కింగ్ , బాక్స్ ఆఫీస్ బాద్షా అబ్బో ఇలా ఒకటా రెండా చాలానే చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారి కాస్త వెనక్కు వెళ్ళి కల్కి గురించి చెప్పుకుంటే ఈ విషయాలు బయటపడతాయి. ఇప్పుడు కల్కి 2వ పార్ట్ లో కొత్త క్యారెక్టర్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.

  • Published Oct 23, 2024 | 5:35 PMUpdated Oct 23, 2024 | 5:35 PM
కల్కి 2 గురించి నవీన్ పోలిశెట్టి హింట్.. అదే నిజమయ్యేలా ఉంది!

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన ,విజయ్ దేవర కొండ, రామ్ గోపాల్ వర్మ , రాజమౌళి. ఇంత మంది స్టార్స్ పేర్లు సడెన్ గా ఎందుకు వచ్చాయని అనుకుంటున్నారా. మరి ఒకరా ఇద్దరా ఏకంగా ప్రభాస్ తో పాటు అంత మంది స్టార్స్ ను పెట్టి.. నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు. కల్కి విడుదల సమయంలో.. వరల్డ్ వైడ్ గా దుమ్ము రేపుతున్న కల్కి , చరిత్ర సృష్టించబోతున్న కల్కి 2898 AD , ఆగని ఊచకోత వారం తిరగకముందే కల్కి భారీ రికార్డ్స్ అంటూ ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. నిజంగానే నాగ్ అశ్విన్ అన్నంత పని చేశాడు. ఎవరు ఊహించని విధంగా కథను అద్భుతంగా తెరపై చూపించాడు. కలలో కూడా జరగవేమో అనుకున్న క్యామియోలను స్క్రీన్ షేర్ చేసుకునేలా చేశాడు. కల్కితో ఏకంగా వేల కోట్ల రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ హిస్టరీలో సరికొత్త చాప్టర్ ఈ సినిమాతోనే స్టార్ట్ అయిందేమో అనిపించేలా చేశాడు.

కల్కి సినిమా తర్వాత సినిమాలోని పాత్రల గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. నిజంగానే కల్కి తో ఓ కొత్త అధ్యయనానికి నాంది పలికారు . కల్కి పార్ట్ 2 కూడా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమా రావడానికి చాలానే సమయం పడుతుందని కూడా తెలియనిది కాదు. ప్రభాస్ కూడా ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ మధ్యలో కల్కి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఆల్రెడీ కల్కి పార్ట్ 2 లో నవీన్ పోలిశెట్టి , నాని నటించబోతున్నారంటూ కొన్ని వార్తలు వినిపించాయి. మొదటి పార్ట్ లో చాలా మంది క్యామియోలను దింపాడు. ఆ సమయంలో వీరిద్దరిని తీసుకోలేకపోవడంతో.. ఎలా అయినా సరే సెకండ్ పార్ట్ కు తీసుకుంటానని చెప్పాడు నాగ్ అశ్విన్. అయితే వీరిలో నాని సంగతి తెలియదు కానీ, నవీన్ పోలిశెట్టి మాత్రం దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది.

ఎందుకంటే, రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా చాలా మంది సెలెబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. ఈ క్రమంలో నవీన్ పోలిశెట్టి కూడా డార్లింగ్ ను విష్ చేస్తూ.. ఆఖరిలో ‘లెట్స్ పార్టీ ఇన్ శంబలా’ అని అన్నాడు. దీనితో ఇక దాదాపు నవీన్ పోలిశెట్టి కల్కి పార్ట్ 2 లో కన్ఫర్మ్ అయినట్లే. దీనిని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం మాత్రమే బ్యాలెన్స్.  ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయిన వెంటనే హను రాఘవపూడి మూవీ పట్టాలెక్కేస్తుంది. ఇక స్పిరిట్ మూవీ మొదలు పెట్టాడంటే మరో మూవీ చేయడానికి లేదని.. సందీప్ కండిషన్ పెట్టాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ చేస్తూనే వచ్చే ఏడాది చివరిలో కల్కి 2 గురించి అనౌన్స్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తాడో.. నాగ అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet Girişcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş