iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు.. నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అనేక సార్లు తనను సెక్యువల్ హెర్రాస్ చేశాడంటూ ఆయన దగ్గర వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో పలు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మరో కేసు నమోదైంది.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అనేక సార్లు తనను సెక్యువల్ హెర్రాస్ చేశాడంటూ ఆయన దగ్గర వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో పలు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మరో కేసు నమోదైంది.

జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు.. నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు

అత్యాచార కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తనను జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కింది ఆయన దగ్గర వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అవుట్ డోర్ షూటింగ్ సమయంలోనే కాదు తన క్యార్ వాన్‌లో కూడా పలుమార్లు లైంగిక దాడి చేశాడని, ప్రతి ఘటించిన ప్రతిసారి మ్యాన్ హ్యాండిలింగ్ చేసేవాడని కంప్లయింట్‌లో పేర్కొంది. నార్సింగిలోని తన ఇంటికి వచ్చి అనేక సార్లు సెక్యువల్ హెర్రాస్ చేశాడంటూ తెలిపింది. మతం మార్చుకుని, తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.  జానీ మాస్టర్ మాత్రమే కాదు అతడి భార్య కూడా తనను కొట్టిందని తెలిపింది. దీంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్‌తో సహా పలు కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు జానీ మాస్టర్ పై మరో కేసు నమోదైంది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుండి లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో పోక్సో కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ప్రస్తుతం నిందితుడి కోసం హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నెల్లూరులో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. జమ్ము కాశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు నెల్లూరుకు, అతడు లడఖ్‌కు, ఇతర ప్రాంతాలకు నాలుగు ప్రత్యేక బృందాలను తరలించారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాధితురాలి వయస్సు 21 సంవత్సరాలు.. కానీ టీనేజ్‌కు ముందు నుండే అతడి దగ్గర వర్క్ స్టార్ట్ చేసింది యువతి. 2017లో ఢీ షోలో పార్టిసిపేట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో జానీ మాస్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

2019లో ఆమెను తన టీంలో చేరమని కోరగా.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా వచ్చి చేరింది. ఆ సమయంలో ఓ ప్రాజెక్ట్ కోసం ముంబయి వెళ్లినప్పుడు.. హోటల్ రూంలో ఉండగా.. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటికీ ఆమె మైనర్. అలాగే పలు ఔట్ డోరింగ్ షూటింగ్ సమయంలో ఆమెపై సెక్సువల్ అబ్యూస్‌కు పాల్పడ్డాడు. వ్యానిటీ వ్యాన్‌లో కూడా లైంగిక తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సమయంలో కూడా అసభ్యకరంగా తాకుతూ హింసించేవాడు. వర్క్ ఇవ్వకుండా మానసికంగా, శారీరకంగా బెదిరించేవాడు. చివరకు అతడి దగ్గర వర్క్ మానేసి.. తను ఇండివిడ్యువల్‌గా చేసుకుంటుంటే.. దాడి చేశాడు. చివరకు ఇదే నీ చివరి షూటింగ్ అంటూ బెదిరింపు లేఖ ఇంటికి తగిలించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేసి.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో మైనర్‌గా ఉన్న సమయంలోనే లైంగి వేధింపులకు గురైనట్లు గుర్తించి జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ పై పోక్సో చట్టం నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.