iDreamPost
android-app
ios-app

నాని నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు !

  • Published May 14, 2025 | 4:18 PM Updated Updated May 14, 2025 | 4:18 PM

అటు హీరోగా ఇటు నిర్మాతగా నాని ఒక్కో ఇటుక పేరుస్తూ పెద్ద గోడనే కట్టేస్తున్నాడు. కోర్టు సినిమాతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు నాని. ఇక ఇప్పుడు నిర్మాతగా అతను నెక్స్ట్ టార్గెట్ చేసిన మూవీకి సంబందించిన అప్డేట్స్ గురించి బజ్ వినిపిస్తుంది. దానికి సంబందించిన వివరాలు చూసేద్దాం.

అటు హీరోగా ఇటు నిర్మాతగా నాని ఒక్కో ఇటుక పేరుస్తూ పెద్ద గోడనే కట్టేస్తున్నాడు. కోర్టు సినిమాతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు నాని. ఇక ఇప్పుడు నిర్మాతగా అతను నెక్స్ట్ టార్గెట్ చేసిన మూవీకి సంబందించిన అప్డేట్స్ గురించి బజ్ వినిపిస్తుంది. దానికి సంబందించిన వివరాలు చూసేద్దాం.

  • Published May 14, 2025 | 4:18 PMUpdated May 14, 2025 | 4:18 PM
నాని నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు !

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా తన మార్క్ సెట్ చేసుకున్నాడు. నాని సినిమా అంటే అది అతను హీరోగా చేసిన సినిమానా లేదా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమానా.. అది ఏ జోనర్ లో ఉంది అని ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా థియేటర్స్ దగ్గర క్యూ కడుతూ ఉంటారు ప్రేక్షకులు. అ! సినిమాతో మొదలైన నాని ప్రొడక్షన్ హిట్ 3 వరకు వచ్చింది. ఇక హిట్ కంటే ముందు రిలీజ్ అయినా కోర్టు మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా విషయంలో నాని మొదటినుంచి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. అందుకే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పైగా కొత్త డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడంలో నాని ఎప్పుడు ముందుంటాడు. నాని చేతిలో పడితే ఆ డైరెక్టర్ ఫేట్ మారిపోవాల్సిందే అని అంతా ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా నాని నెక్స్ట్ టార్గెట్ ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు. కానీ నాని ఏ సినిమాతో వచ్చిన అందులో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉంటుందన్న మాట మాత్రం నిజం. ఇక కోర్టు సినిమా దర్శకుడు రామ్ జగదీశ్ రెండో సినిమాకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఒక మూవీ సక్సెస్ అయ్యాక మరో మూవీకి ప్రిపేర్ అవ్వడం పెద్ద విషయమేమి కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ జగదీష్ రెండో మూవీని కూడా నాని ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలిసింది. బ్యాక్ టు బ్యాక్ ఒకే డైరెక్టర్ కు నాని కమిట్ అవ్వడం అనేది చాలా రేర్. శైలేష్ కొలను తర్వాత నాని రామ్ జగదీశ్ కే ఇలా కమిట్ అయ్యాడు.

దుల్కర్ సల్మాన్ హీరోగా నాని ప్రొడ్యూసర్ గా రామ్ జగదీశ్ డైరెక్షన్ లో ఈ మూవీ ఉండబోతుందట. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ దాదాపు అంతా ఫిక్స్ అయినట్టే అని తెలుస్తుంది. ఫైనల్ స్క్రిప్ట్ కాస్త ఒకే అనుకున్న తర్వాత అఫీషియల్ అనౌన్సమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ ముహూర్తాన నాని ప్రొడ్యూసర్ గా అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ.. ఇండస్ట్రీకి మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందిస్తున్నాడు. ఇక నాని నుంచి నెక్స్ట్ ఎలాంటి మూవీస్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.