Swetha
అదేంటో తెలీదు కానీ ఇప్పుడు నాని పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. నాని సుడి మాములుగా లేదని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ బాటలో నడుస్తున్నాడు నాని. ఇక ఇప్పుడు నాని నటించబోతున్న నెక్స్ట్ మూవీ ఆడియో రైట్స్ కు భారీ డీల్ ఫిక్స్ అయిందట.
అదేంటో తెలీదు కానీ ఇప్పుడు నాని పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. నాని సుడి మాములుగా లేదని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ బాటలో నడుస్తున్నాడు నాని. ఇక ఇప్పుడు నాని నటించబోతున్న నెక్స్ట్ మూవీ ఆడియో రైట్స్ కు భారీ డీల్ ఫిక్స్ అయిందట.
Swetha
హిట్ 3 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో కలిసి ది ప్యారడైజ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాని పూర్తిగా మాస్ యాక్షన్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. అదేంటో తెలీదు కానీ ఇప్పుడు నాని పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. నాని సుడి మాములుగా లేదని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ బాటలో నడుస్తున్నాడు నాని. ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్ లో నాని అడుగుపెట్టనే లేదు కానీ టాక్ మాత్రం బాగా స్ప్రెడ్ అవుతుంది. పైగా రీసెంట్ గా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ డీల్ ఫిక్స్ అయిందట.
ది ప్యారడైజ్ మూవీ ఆడియో రైట్స్ ను.. సరిగమ సంస్థ 18 కోట్లకు కొనుగోలు చేయడం సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో నాని అనిరుద్ కాంబినేషన్ లో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు మూవీస్ లో సాంగ్స్ బాగానే హిట్ అయ్యాయి. సో ఈసారి కూడా వీరి ఇద్దరి కాంబో కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయిందని చెప్పి తీరాల్సిందే. నాని కెరీర్ లోనే కాకుండా ఇప్పటివరకు తెలుగు హీరోల్లో చాలా రేర్ గా కనిపించిన ఓ షాకింగ్ ట్విస్ట్.. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ లో ఉంటుందని ఆల్రెడీ హింట్స్ వచ్చేసాయి. ఇవన్నీ కేవలం మాటల వరకా లేదా స్క్రీన్ మీద కూడా ఉంటుందా అనేది మూవీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మూవీ టీం అనౌన్స్ చేశారు . ఇక చెప్పిన టైం కు వస్తుందా లేదా అనేది చూడాలి. ప్యారడైజ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.