iDreamPost
android-app
ios-app

వీడియో: ’విజయ్‌తో కాదు.. నానితో ముందు తీయాల్సింది‘: సందీప్ వంగా

Nani and Sandeep Reddy Vanga Interview తండ్రి, కొడుకుల ప్రేమ కథగా తెరకెక్కిన యానిమల్ థియేటర్లలతో సందడి చేస్తోంది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా రూపుదిద్దుకున్న ఈ మూవీని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సంగతి విదితమే. తాజాగా ఆయన మరో స్టార్ నటుడు నానితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Nani and Sandeep Reddy Vanga Interview తండ్రి, కొడుకుల ప్రేమ కథగా తెరకెక్కిన యానిమల్ థియేటర్లలతో సందడి చేస్తోంది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా రూపుదిద్దుకున్న ఈ మూవీని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సంగతి విదితమే. తాజాగా ఆయన మరో స్టార్ నటుడు నానితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

వీడియో: ’విజయ్‌తో కాదు.. నానితో ముందు తీయాల్సింది‘: సందీప్ వంగా

లవ్ అంటే ఇలాగే ప్రజెంట్ చేయాలన్న ధోరణికి చెక్ పెట్టేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో ఆయన క్రియేట్ చేసిన మేనియా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క హీరో ఇలాంటి మూవీ చేయాలని ఆశపడుతున్నవారే. విజయ్ దేవరకొండ లాంటి నార్మల్ యాక్టర్‌ను టాలీవుడ్ మాత్రమే కాదూ బాలీవుడ్ హీరోయిన్లు సైతం మెస్మరైజ్ అయ్యేలా చేసింది ఆ మూవీ. ఈ రౌడీ బాయ్‌తో యాక్ట్ చేయాలని ఊవిళ్లూరుతున్నారు బీటౌన్ యంగ్ గర్ల్స్. ఇదే మూవీని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి థియేటర్లలతో వదిలేతే.. బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ యానిమల్ మూవీతో ముందుకు వచ్చాడు సందీప్. డిసెంబర్ 1న థియేటర్లలలో విడుదలైంది.

మరో వారంలో నాని హాయ్ నాన్న మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలు విడుదల సందర్భంగా ఇద్దరు కలిసి ‘హాయ్ నాని యానిమల్’ పేరుతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ పంచుకున్నారు సందీప్. విజయ్ దేవరకొండతో కన్నా ముందుగా నానితో సినిమా అనుకున్నాడట.. అయితే తన బలుపు మూలంగా అది వర్కౌట్ కాలేదట. 2010-11లో ఫిల్మ్ స్కూల్లో కోర్స్ అయిపోయాక.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ లవ్ స్టోరీ అనుకున్నాడట. అదే సమయంలో నాని, తనీష్ హీరోలుగా నటించిన రైడ్ మూవీ చూశాడట. అప్పుడే నాని యాక్టింగ్‌కు ఫిదా అయినట్లు చెప్పాడు. మీ మాడ్యులేషన్, మాస్ హీరో, మస్తు ఉన్నాడని అనుకున్నాడట. అయితే ఆ సాఫ్ట్ లవ్ స్టోరీకి మీరే హీరో అనుకుని.. నిర్మాత వద్దకు వెళ్లాడట. కథ చెబితే నచ్చిందని, ఎవరూ హీరో అంటే నాని అంటే.. వద్దని చెప్పాడట ప్రొడ్యూసర్.

‘ప్రొడ్యూసర్.. నాలుగు ఆప్షన్లు చెబితే.. మనకున్న బలుపుకు.. మనం అనుకున్న కథకు హీరో వేరు.. ఆయన చెప్పే పేరు ఇంకొకరు ఛల్ తీయ్ అని వచ్చేశాను’ అని అన్నారు. ఫ్రెండ్స్ అప్పుడు తిట్టారట. ఆ తర్వాత తాను రెగ్యులర్ గా వెళ్లే కెఫేకు వెళ్లి కూర్చొగా.. నాని తన ఫ్రెండ్స్‌తో అక్కడే ఉన్నాడట. తన స్నేహితులతో డీప్ డిస్కషన్‌లో ఉన్నాడట. ‘ఇలా కథ ఉంది.. ప్రొడ్యూసర్ తీసుకొస్తారా చేద్దామా అని ఐస్ బ్రేక్ చేసేందుకు ట్రై చేస్తున్నా. నాకు మొహమాటం అడ్డొచ్చింది. మీ ఫ్రెండ్స్‌తో వేరో మూడ్‌లో ఉన్నారు. మళ్లీ వచ్చి కదిలితే ప్లీజ్ డోంట్ డిస్ట్రబ్ అని అంటే తట్టుకోలేను. ఆ తర్వాత అలా మొదలైంది వచ్చింది. మీ కెరీర్ ఎక్కడికో గ్రోత్ అయ్యింది. మనం ఒక గెస్ కొడతాం. వాళ్లు అలా స్టార్ అయిపోతుంటే ఓ అడ్మైర్ కు గురయ్యా’ అని నాని గురించి చెప్పారు. మన ఐస్ బ్రేక్ అయినై.. ఈ సారి అనిపిస్తే చెప్పు అంటూ నాని ఫన్నీగా అనడంతో.. నవ్వుకున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş