iDreamPost
android-app
ios-app

ఎంతోమంది ఆకలి తీర్చిన నటుడు నందు.. స్వయంగా వండి.. వడ్డించి మరీ..

  • Published Feb 14, 2024 | 8:22 AM Updated Updated Feb 14, 2024 | 8:22 AM

Nandu is Shows Humanity: కొంతమంది సినీ సెలబ్రెటీలు సేవా కార్యక్రమాల్లో కూడా తమదైన ముద్ర వేస్తుంటారు. అన్నదానం కార్యక్రమంతో వందల మంది ఆకలి తీర్చారు నటుడు నందు

Nandu is Shows Humanity: కొంతమంది సినీ సెలబ్రెటీలు సేవా కార్యక్రమాల్లో కూడా తమదైన ముద్ర వేస్తుంటారు. అన్నదానం కార్యక్రమంతో వందల మంది ఆకలి తీర్చారు నటుడు నందు

  • Published Feb 14, 2024 | 8:22 AMUpdated Feb 14, 2024 | 8:22 AM
ఎంతోమంది ఆకలి తీర్చిన నటుడు నందు.. స్వయంగా వండి.. వడ్డించి మరీ..

తెలుగు ఇండస్ట్రీలో చిన్న పాత్రల్లో నటించి తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో నటుడు నందు ఒకరు. 2006 లో ఫోటో మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత ముఖ్యపాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటాడు. నటుడిగానే కాకుండా ఐపీఎల్ , క్రికెట్ లీడ్ మ్యాచ్ లకు, టీవీల్లో రియాల్టీ షోలకు  హూస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల వెబ్ సీరీస్ లో కూడా తనదైన మార్క్ చాటుకుంటున్నాడు. ప్రముఖ సింగర్ గీతా మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నందు. గతంలో కరోనా సమయంలో ఎంతోమందికి సాయమందించాడు… తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నాడు నందు. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు నందూ-గీతా మాధురి. ఇటీవల తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. తండ్రి కానున్న వేళా విశేషం.. గొప్ప మనసు చాటుకున్నాడు నందు. అన్నదానం చేసి 800 వందల మంది ఆకలి తీర్చాడు. అది కూడా స్వయంగా వండి, వడ్డించాడు. ఈ కార్యక్రమం శ్రీ విద్యాపీఠంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంగా కూరగాయలు కోయడం మొదలు.. వంటల్లో కూడా సహాయం అందించి, అందరికీ వడ్డించాడు. ఓ వైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తూనే.. సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల వెబ్ సీరీస్ తో బిజీగా ఉన్న నందు మ్యాన్షన్ 23, వధువు వెబ్ సీరీస్ లకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడంతో మరిన్ని వెబ్ సీరీస్ లో నటించే అవకాశం లభించింది. స్టార్ సింగర్ గీతామాధురిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంటకు ఒక పాప జన్మించింది. త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు నందు.

ఇటీవలే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గీతామాధురి సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు.. ఏకంగా 800 మంది ఆకలి తీర్చారు. స్వయంగా దగ్గరుండి మరీ వడ్డించాడు.. అంతేకాదు అన్నదానం తర్వాత స్వయంగా పాత్రలు కూడా తానే కడిగారు. తాను ఒక సెలబ్రెటీ అన్న విషయాన్ని పక్కనబెట్టి సామాన్యుడిగా గొప్ప మనసు చాటుకున్నాడు నందు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @that_actor_nandu

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş