Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ ఎందుకంత హిట్టైంది? కారణాలు ఇవే!

'భగవంత్ కేసరి' డైరెక్డర్ అనిల్ రావిపూడి తన పంథా మార్చి.. నందమూరి బాలకృష్ణతో సూపర్ డూపర్ హిట్ కొట్టించాడు. మరి భగవంత్ కేసరి అంత పెద్ద హిట్ కావడానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

'భగవంత్ కేసరి' డైరెక్డర్ అనిల్ రావిపూడి తన పంథా మార్చి.. నందమూరి బాలకృష్ణతో సూపర్ డూపర్ హిట్ కొట్టించాడు. మరి భగవంత్ కేసరి అంత పెద్ద హిట్ కావడానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘భగవంత్ కేసరి’ అసలు ఇది బాలకృష్ణ చేసే జోనర్ సినిమా కాదు. ఆయన ట్రెండూ కాదు, బ్రాండూ కాదు. అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి మార్కు సినిమా కూడా కాదు. కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ ఎక్కడా లేని సినిమా ఇది. కంప్లీట్ గా ఎమోషనల్ మూవీ. మరి ఎలా ఆడింది? అంత పెద్ద హిట్ ఎలా అయింది? భగవంత్ కేసరి సినిమాకి ప్రేక్షకులు ఎందుకంతలా బ్రహ్మరథం పట్టారు? ఆ కలెక్షన్లు ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం సాధ్యం కాదు. కానీ, సినిమా కలెక్షన్లు దుమ్ముదులిపి 50 రోజులవైపు దూసుకెళ్ళింది భగవంత్ కేసరి.

బాలకృష్ణతో సినిమా అన్న దగ్గర్నుంచీ దర్శకుడు అనిల్ రావిపూడి మరో లోకంలో విహరించాడు. కథ రాస్తున్నంత సేపూ పెద్దగా ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడిందే లేదు. ఎవ్వరినీ కలవలేదు కూడా. ఏం కథ రాస్తాడు ఇంత తీక్షణంగా ఆలోచించి.. ప్రతీవాడికీ డౌటే. బాలయ్య సినిమాలు ఓ పంథాలో ఉంటాయి. ఓ పరిధిలో ఉంటాయి. అవి దాటి ఆయన సినిమాలేవీ కూడా జరగలేదు. అయితే కొన్ని చిత్రాలు బాక్సాఫీసు దగ్గర దెబ్బతిన్నాయి కూడా. మరి అనిల్ రాస్తున్నంత కాలమంతా అందరిలో కదలిన ప్రశ్నావళి ఇదే.

సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవ్వరూ ఊహించని పంథాలో అనిల్ కథని తెరకెక్కించాడన్న సర్ప్రైజ్ లో మునిగిపోయారు ఫ్యాన్స్. బాలయ్య ఏజ్ కి తగిన పాత్రనే ఇందులో పోషించాడు. ఈ మధ్యనే కమర్షియల్ గ్లామర్ని సింగారించుకుని, హీరోల సరసన చిందులేస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీలని ఏకంగా కూతురు పాత్రలోకి తెచ్చేశాడు దర్శకుడు అనిల్. ఇవి రెండూ సాహసాలే. ఏటికి ఎదురీదడం లాంటిది ఇది. బాలకృష్ణని ఇక్కడ మెచ్చుకోవాల్సిందే. దర్శకుడు చెప్పిన పాయింట్ ని, క్యారెక్టర్ని ఎక్కడా అభ్యంతరపెట్టకుండా శిరసావహించాడు. సరే.. ఆయన డైలాగులు ఆయనకున్నాయి. యాక్షన్ పార్ట్ యాక్షన్దే. ఇన్ని కలగలిపి భగవంత్ కేసరి కాస్తా ఫ్యామిలీ సినిమా అయిపోయింది. దీనికి ప్లస్ అయిన పాయింట్ కూడా ఉంది. దానిని అనిల్ చాలా చాకచక్యంతో వాడుకున్నాడు.

ఇటీవల రోజులలో ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షోతో బాలయ్య కాస్త మాస్ నుంచి క్లాస్ కి, అక్కడ నుంచి డ్రాయింగ్ రూంలో, ఫ్యామిలీకి చాలా దగ్గరగా జరిగొచ్చారు. ఈ షోతో.. బాలకృష్ణను అందరూ సొంతం చేసుకున్నారు. దెబ్బకి ఆయన ఫ్యామిలీ హీరో అయిపోయారు. అయితే గతంలో కూడా ఆయన చేసిన ఫ్యామిలీ డ్రామా చిత్రాలు ముద్దుల మావయ్య లాండ్ మార్క్ హిట్లు అయినవి ఉన్నాయి. కానీ తర్వాతి రోజులలో బాలయ్య టెంపోయే పూర్తిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితులలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి. కానీ శ్రీలీల, బాలకృష్ణ కాంబినేషన్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. అదే సినిమాకి చాలా యాడ్ అయింది. ఇటువంటి కథను అంగీకరించిన బాలకృష్ణకే ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్స్ చెప్పాలి. దానికి కొంచెం ముందు దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా విస్మరించలేం. తనే గనక ఈ కథ రాయకపోతే బాలయ్యకు ఇంత మంచి హిట్ ఈ టైంలో వచ్చి ఉండేది కాదు.

                                                                                                                                                                                                                                                                                    – నాగేంద్ర కుమార్

Show comments