iDreamPost

హీరోగా గౌతమ్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత!

హీరోగా గౌతమ్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుమారుడు గౌతమ్‌ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటంపై తల్లి నమ్రత క్లారిటీ. గౌతమ్‌ చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి హీరోగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకు ఓ 7 నుంచి 8 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో నమ్రత మాట్లాడుతూ.. ‘‘ గౌతమ్‌ వయసు ప్రస్తుతం 16 ఏళ్ల సంవత్సరాలు మాత్రమే. లాంఛింగ్‌కు కొంత టైం పడుతుంది. అతడు ఇప్పుడు చదువుకుంటున్నాడు.

అతడికి చదువు మీదే ఎక్కువ శ్రద్ధ ఉంది. ప్రస్తుతం చదవటంలో బిజీగా ఉన్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ఇంకో 7-8 ఏళ్లు పట్టొచ్చు’’ అని అన్నారు. కాగా, మహేష్‌-నమ్రతల గారాలపట్టి సితార ఓ ప్రముఖ జ్యువెలరీ కంపెనీ యాడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. పీఎమ్‌జే జ్యువెలరీకి ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ యాడ్‌ షూట్‌లోనూ కనిపించారు. ఈ యాడ్‌ కోసం సితార ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పారితోషికాన్ని కూడా ఆమె తన తండ్రి చారిటీకి ఇచ్చిందట. ఇక, గౌతమ్‌ విషయానికి వస్తే.. అతడి సినిమా ఎంట్రీ ఎప్పుడో జరిగిపోయింది. తండ్రి సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 1 నేనొక్కడినే అనే సినిమాలో మహేష్‌ బాబు చిన్నప్పటి పాత్ర చేశారు. తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. మహేష్‌ ఫ్యాన్స్‌ మాత్రం బుల్లి సూపర్‌ స్టార్‌ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, గౌతమ్‌ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటంపై తల్లి నమ్రత క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి