iDreamPost
android-app
ios-app

మహేశ్ మంచి మనసు.. తండ్రి పేరిట విద్యార్థులకు స్కాలర్ షిప్!

  • Published Nov 14, 2023 | 4:06 PM Updated Updated Nov 14, 2023 | 4:06 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. ఇప్పుడు తండ్రి పేరిట మరో బృహత్కార్యానికి పూనుకున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. ఇప్పుడు తండ్రి పేరిట మరో బృహత్కార్యానికి పూనుకున్నారు.

  • Published Nov 14, 2023 | 4:06 PMUpdated Nov 14, 2023 | 4:06 PM
మహేశ్ మంచి మనసు.. తండ్రి పేరిట విద్యార్థులకు స్కాలర్ షిప్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. నటన పరంగా ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్, ఒక్కో సీన్ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రావాల్సిందే. అయితే నటుడిగా మహేశ్ ఎంత స్టారో అందరికీ తెలుసు. వ్యక్తిత్వం పరంగా ఆయన మరింత ఉన్నతంగా ఉంటారు. సామాజిక స్పృహ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఘట్టమనేని కుటుంబం ముందుంటుంది. ఇప్పటికే మహేశ్ బాబు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి.. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇంకో భృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థులను చదివించేందుకు నడుం బిగించారు.

హీరోగానే కాకుండా మహేశ్ బాబుకు వ్యక్తిగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎంతోమంది కోట్లు సంపాదిస్తారు. కానీ, సంపాదించిన దాంట్లో కొంత అయినా పేదలకు అందించాలి అని చాలా తక్కువ మందే అనుకుంటారు. సమాజం గురించి ఆలోచించాలి, పేదలకు సాయం చేయాలని అనుకునే వారిలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం ముందుంటుంది. ఇప్పటికే మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఇంకో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. పేద విద్యార్థులకు చదువు చెప్పేంచేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహేశ్ సతీమణి నమ్రతా వెల్లడించారు. ఐ డ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు.

“మామయ్య గారి వర్దంతి సందర్భంగా.. ఆయన పేరు మీద ఒక స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం. ఇప్పటికే నలుగురు చురుకైన విద్యార్థులను ఎంపిక చేశాం. వారిని చదివించే బాధ్యతను ఎంబీ ఫౌండేషన్ తీసుకుంటుంది. వారి చదువు పూర్తయ్యే వరకు మాదే బాధ్యత. ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేసే స్టూడెంట్స్ కచ్చితంగా పేద విద్యార్థులే అయి ఉంటారు. వారి చదువుకు సంబంధించిన పూర్తి స్పాన్సర్ షిప్ మేము ఎంబీ ఫౌండేషన్ ద్వారా చేస్తాం. ఈ చిన్న కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు మాకు ఉంటాయని ఆకాంక్షిస్తున్నాం” అంటూ నమ్రత వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్ కృష్ణ హయాంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే.. ఇండస్ట్రీలో కూడా ఎన్నో గొప్ప పనులు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరినో ఆదుకున్నారు. తండ్రిని చూసి అలాంటి  ఎన్నో మంచి గుణాలను మహేశ్ బాబు కూడా అలవరుచుకున్నారు. ముఖ్యంగా పేదలు, పేద పిల్లలను ఆదుకోవడంలో ముందుంటారు. ఆయన చేసే ఏ సేవా కార్యక్రమం అయినా నలుగురికి మంచి చేసేలా ఉంటుంది. తాజాగా చేపట్టిన స్కాలర్ షిప్ కార్యక్రమం కూడా ఆ కోవకే చెందుతుంది.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio