iDreamPost
android-app
ios-app

Maldives: మాల్దీవ్స్ వెళదామని టికెట్స్ బుక్ చేసి క్యాన్సిల్ చేశాను

  • Published Jan 13, 2024 | 2:39 PM Updated Updated Jan 13, 2024 | 2:39 PM

ఇటీవల మోడీ పర్యటన తర్వాత మాల్దీవ్స్ విషయంలో తలెత్తిన వివాదాల గురించి తెలిసిందే. అయితే, ఈ విషయంలో హీరో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

ఇటీవల మోడీ పర్యటన తర్వాత మాల్దీవ్స్ విషయంలో తలెత్తిన వివాదాల గురించి తెలిసిందే. అయితే, ఈ విషయంలో హీరో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

  • Published Jan 13, 2024 | 2:39 PMUpdated Jan 13, 2024 | 2:39 PM
Maldives: మాల్దీవ్స్ వెళదామని టికెట్స్ బుక్ చేసి క్యాన్సిల్ చేశాను

సాధారణంగా సినీ సెలెబ్రిటీలందరూ వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో వారికంటూ ఫ్రీ టైమ్ దొరికినపుడు ఎక్కడికైనా వెకేషన్స్ కు వెళ్లడం సహజం. ఇక వెకేషన్ అంటే ఎక్కువ మంది విసిట్ చేసే ప్లేస్ మాల్దీవ్స్ . చాలా మంది సెలెబ్రిటీలు ఈ ప్లేస్ కే వెళ్తూ ఉంటారు. అయితే, ఈ మధ్య కాలంలో మాల్దీవ్స్ విషయమై కొన్ని ఆసక్తికర చర్చలు నడిచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కొన్ని వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మాల్దీవ్స్ కు వెళ్దాం అనుకున్న ఎంతో మంది వారి ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక తాజగా ఈ విషయమై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. మాల్దీవ్స్ కు వెళదామని టికెట్స్ బుక్ చేసి, క్యాన్సిల్ చేశానంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా అక్కినేని నాగార్జున నటించిన చిత్రం “నా సామి రంగ”. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ జనవరి 14న ఈ మూవీ థియేటర్ లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే, ప్రమోషన్స్ లో భాగంగా.. నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తన మాల్దీవ్స్ వెకేషన్ విషయమై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ కు ఎమన్నా ప్లాన్ చేస్తున్నారా అని అడుగగా.. నాగార్జున ఇలా చెప్పుకొచ్చారు. ” ఈ సినిమా కోసం నాన్ స్టాప్ గా 75 రోజులు వర్క్ చేశాను. అటు బిగ్ బాస్ హోస్టింగ్ కూడా ఉండడంతో.. ఫ్యామిలీకి కూడా టైమ్ ఇవ్వలేకపోయాను. విరామం లేకుండా వర్క్ చేయడం వలన..’నా సామి రంగ’ చిత్రం విడుదల తర్వాత మాల్దీవ్స్ కు వెకేషన్ వెళ్దాం అనుకుని.. టికెట్ బుక్ చేశాను. కానీ, క్యాన్సిల్ చేశాను. ఇప్పటివరకు చాలా సార్లు మాల్దీవ్స్ వెళ్ళాను. కానీ, తాజాగా ఈ విషయం మీద ఏవైతే వివాదాలు తలెత్తయో.. అది సరైనది కాదు. కాబట్టి నేను కూడా నా టికెట్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాను” అంటూ చెప్పారు.

ఇక ఈసారి సంక్రాంతికి ‘నా సామి రంగ’ తో.. తన మాస్ యాక్షన్ చూపించబోతున్నాడు నాగార్జున. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, కొన్ని సాంగ్స్ తో ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు మూవీ టీమ్ ప్రమోషన్స్ లో మిగిలిన అన్ని మూవీలకు గట్టి పోటీనే ఇచ్చారు. ఇక సంక్రాంతి బరిలో కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, తాజాగా నాగార్జున మాల్దీవ్స్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss