iDreamPost

గుంటూరు కారం సినిమా విషయంలో తప్పు చేశాను: నిర్మాత నాగ వంశీ

గుంటూరు కారం సినిమా నిర్మాత నాగవంశీ తాజాగా మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు కారం సినిమా విషయంలో తాను ఓ తప్పు చేశానని అన్నారు.

గుంటూరు కారం సినిమా నిర్మాత నాగవంశీ తాజాగా మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు కారం సినిమా విషయంలో తాను ఓ తప్పు చేశానని అన్నారు.

గుంటూరు కారం సినిమా విషయంలో తప్పు చేశాను: నిర్మాత నాగ వంశీ

గుంటూరు కారం సినిమా విడుదలై వారం పైనే అయింది. మొదట నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. కలెక్షన్ల విషయంలో మాత్రం సత్తా చాటుతోంది. ఈ మూవీ మొదటి రోజు ఏకంగా.. 94 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక వారం రోజుల్లో గుంటూరు కారం సినిమా 212 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 100 కోట్లకు పైగా షేర్‌ కలెక్ట్‌ చేసింది. దీంతో 5 రీజనల్ సినిమాలతో 100 కోట్లు షేర్ దక్కించుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోగా మహేష్‌ బాబు రికార్డు సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

​ఇక, ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఓ రిపోర్టర్‌ సలార్‌తో… గుంటూరు కారంను పోలుస్తూ ఓ ప్రశ్న వేశారు. ఇందుకు నాగవంశీ సమాధానం ఇస్తూ.. ‘‘ సలార్‌ మాస్‌ సినిమా అండీ.. సింపుల్‌.. అది పెద్ద మాస్‌ సినిమా.. ఫ్యాన్స్‌కు ఒంటి గంట షో చూసినపుడు హై వచ్చింది. ఇది ఫ్యామిలీ సినిమా.. త్రివిక్రమ్‌ గారి సినిమా.. నేను మిస్టేక్‌ ఎక్కడ చేశానంటే..

I was wrong about Guntur curry

ఓ త్రివిక్రమ్‌ గారి ఫ్యామిలీ సినిమా.. మధర్‌ అండ్‌ సన్‌ బాండ్‌ గురించి తీసిన ఫ్యామిలీ సినిమా వన్‌ ఓ క్లాక్‌ షో వేసి తప్పు చేశానేమోనని నా అనాలిసిస్‌లో నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో తప్పు చేశామని మేము ఫీల్‌ అవుతున్నాము. మీడియా ఫీల్డ్‌లో ఉన్న చాలా మంది చాలా ఎక్స్‌పెక్ట్‌ చేశారు. కానీ, గుంటూరు కారం ఆ లెవల్‌ను చేరుకోలేకపోయింది. అదొక యాంగిల్‌ పక్కన పెడితే.. దాని గురించి పట్టించుకోవటం లేదు. మా సైడ్‌ నుంచి జరిగిన తప్పు ఏంటంటే.. 1 గంట షో వేయటం’’ అని అన్నారు.

కాగా, గుంటూరు కారం సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాంటి కలెక్షన్లు.. తెలంగాణలో ఒకలాంటి కలెక్షన్లు వస్తున్నాయి. ఏపీలో ఈ మూవీ ఇప్పటికే 90 శాతం బ్రేక్‌ ఈవెన్‌ను క్రాస్‌ చేసింది. కానీ, తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా.. నష్టాల్లో కూరుకుపోయింది. ఇదే నిర్మాతలను కలవర పెడుతోంది. దానికి తోడు నిర్మాతలు తప్పుడు కలెక్షన్లను చెబుతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన నాగవంశీ తమ సినిమావి జెన్యూన్‌ కలెక్షన్లు అని అన్నారు. మరి, గుంటూరు కారం ఒంటిగంట షో విషయంలో తప్పు చేశానంటున్న నాగవంశీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి