iDreamPost
android-app
ios-app

మజిలీ మూవీ చైల్ట్ ఆర్టిస్టు ఇప్పుడు చూస్తే వావ్ అనాల్సిందే..

  • Published Apr 29, 2024 | 5:13 PM Updated Updated Apr 29, 2024 | 5:13 PM

రీల్ లైఫ్ జోడీల్లో ది బెస్ట్ జంటల్లో ఒకటి నాగ చైతన్య-సమంత. ఈ ఇద్దరు చివరి సారిగా కలిసి నటించిన చిత్రం మజిలీ. ఇందులో శ్రావణి, పూర్ణ పాత్రల్లో జీవించారు ఒకప్పటి భార్యా భర్తలు. అయితే ఇందులో నటించిన చిన్న పాప గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

రీల్ లైఫ్ జోడీల్లో ది బెస్ట్ జంటల్లో ఒకటి నాగ చైతన్య-సమంత. ఈ ఇద్దరు చివరి సారిగా కలిసి నటించిన చిత్రం మజిలీ. ఇందులో శ్రావణి, పూర్ణ పాత్రల్లో జీవించారు ఒకప్పటి భార్యా భర్తలు. అయితే ఇందులో నటించిన చిన్న పాప గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • Published Apr 29, 2024 | 5:13 PMUpdated Apr 29, 2024 | 5:13 PM
మజిలీ మూవీ చైల్ట్ ఆర్టిస్టు ఇప్పుడు చూస్తే వావ్ అనాల్సిందే..

వెండితెరపై అలరించిన బెస్ట్ కపుల్స్‌లో ఒకటి నాగ చైతన్య, సమంతల జోడీ. ఏం మాయ చేశావే మూవీతో ఆకట్టుకుంది ఈ జంట. మనం మూవీ మరో మైలు రాయి. ఆటో నగర్ సూర్యతో మరోసారి జతకట్టి ప్రేక్షకులను కనువిందు చేశారు. ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుణ్ణు అనిపించేంతలా ఆకట్టుకుంది. ప్రేక్షకులు ఆశించినట్లే.. ఈ మూడు సినిమాలతో ప్రేమలో పడిన ఈ రీల్ కపుల్..2017లో రియల్ కపుల్‌గా మారారు. ఆ తర్వాత మూడేళ్లకే విడిపోయారు .. అదే వేరే విషయం ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. పెళ్లి అయ్యాక సామ్.. బ్లాక్ బస్టర్ హిట్స్ చూసింది. పెళ్లైన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం మజిలీ. 2019లో వచ్చిన ఈ మూవీ క్లాసిక్ హిట్ అందుకుంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీకి బ్రహ్మరథం పట్టారు. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. సుమారు రూ. 70 కోట్లు వసూలు చేసింది. చై కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది మజిలీ. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్స్. ‘ప్రియతమా ప్రియతమా‘, ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు చూపిస్తాడు’ సాంగ్స్ ఇప్పటికి చార్ట్ బస్టర్సే. ఇక ఇందులో సామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. భర్త ప్రేమ కోసం పరితపించిపోయే భార్య పాత్రలో జీవించేసింది ఈ నటి. శ్రావణి (సామ్ క్యారెక్టర్)లాంటి భార్య కావాలని కోరుకున్నారు కుర్రాళ్లు సైతం. ఇక చైతూ కూడా డిఫరెంట్ రోల్‌లో నటించాడు. విరహా ప్రేమికుడిగా అలరించాడు.

ఈ సినిమాలో మరో కీ రోల్ ఉంది. అదే మీరా క్యారెక్టర్. మీరా వచ్చాక మూవీ మొత్తం మారిపోతుంది. మీరా పాత్రలో నటించిన చిన్నారి గుర్తింది కదా. ఇప్పుడు ఆ పాప ఎంతలా మారిపోయిందో తెలుసా..? ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టు కాదు.. హీరోయిన్ మెటీరియల్ అయ్యింది. ఇంతకు ఆ పాప పేరు ఏంటంటే.. అనన్య అగర్వాల్.  2004లో ముంబయిలో పుట్టిన అమ్మడికి ఇప్పుడు 20 ఏళ్లు వచ్చేశాయి. 2008 నుండి బుల్లితెరపై రాణించింది ఈ చిన్నారి. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నాలో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ నుండి వరుసగా సీరియల్స్ చేసింది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? క్యా హువా తేరా వాద, మహా భారత్, సియా కే రామ్ వంటి సీరియల్లో నటించింది. ఇవే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా మెరిసింది.

కానీ ఆమెకు వెండితెరపై అవకాశం ఇచ్చింది మజిలీ మూవీ. ఈ సినిమాలో చైతూ మాజీ ప్రేయసి కూతురిగా అలరించి మెప్పించింది. ఈ పాప యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు రాలేదు. బుల్లితెరపైనే మెప్పిస్తూ ఉంది. అలాగే సోషల్ మీడియాలో యమ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో బ్రాండ్స్ ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తోంది. మళ్లీ ఆమె హీరోయిన్‌గా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet