iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: కల్కి 2లో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఇదే.. ఆసక్తికర ట్వీట్‌ చేసిన నాగ్‌ అశ్విన్‌

  • Published Jul 04, 2024 | 10:29 AM Updated Updated Jul 04, 2024 | 10:29 AM

కల్కి భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌ ఒకటి ఆసక్తికరంగా మారింది. పైగా దీనిలో పార్ట్‌ 2 లో ప్రభాస్‌ క్యారెక్టర్‌పై క్లూ ఇచ్చాడు అంటున్నారు నెటిజనులు. ఆ వివరాలు..

కల్కి భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌ ఒకటి ఆసక్తికరంగా మారింది. పైగా దీనిలో పార్ట్‌ 2 లో ప్రభాస్‌ క్యారెక్టర్‌పై క్లూ ఇచ్చాడు అంటున్నారు నెటిజనులు. ఆ వివరాలు..

  • Published Jul 04, 2024 | 10:29 AMUpdated Jul 04, 2024 | 10:29 AM
Kalki 2898 AD: కల్కి 2లో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఇదే.. ఆసక్తికర ట్వీట్‌ చేసిన నాగ్‌ అశ్విన్‌

కల్కి 2898 ఏడీ సినిమా వచ్చి వారం రోజులు అవుతున్నా.. క్రేజ్‌ మాత్రం ఇంకా తగ్గడం లేదు. వారం రోజుల్లోనే సుమారు 700 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పరుగులు తీస్తుంది కల్కి. ఇక వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ మీద.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకోనే ప్రధాన పాత్రల్లో వచ్చిన కల్కి.. ప్రపంచ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసే దిశగా పరుగులు తీస్తోంది. మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక పార్ట్ 1 క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి.. కల్కి పార్ట్‌ 2పై అంచనాలు మరింత పెంచాడు నాగ్‌ అశ్విన్‌. ఇక ఆగస్టు 10 నుంచి కల్కి పార్ట్‌ 2 షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కల్కి పార్ట్‌ 2 లో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో రివీల్‌ చేస్తూ.. ట్వీట్‌ చేశారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఆ వివరాలు..

కల్కి భారీ విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విజయానికి మూల కారణం ప్రభాస్‌ అని చెప్పుకొచ్చాడు నాగ్‌ అశ్విన్‌. కల్కి సెట్‌లో ప్రభాస్‌ కూర్చుని ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ.. “ఈ విజయాలన్నింటికీ కారణం అదిగో అక్కడ ఎంతో క్యాజువల్‌గా కూర్చొని ఉన్న వ్యక్తే. ఆయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్. దర్శకత్వంలో నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. మనందరి డార్లింగ్. భైరవ (కల్కిలో ప్రభాస్ పేరు) ఇప్పుడు K____” అంటూ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

ఈ ఒక్క ట్వీట్‌తో ప్రభాస్‌ పాత్రపై ఆసక్తిని మరింత పెంచాడు నాగ్‌ అశ్విన్‌. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్.. క్లైమాక్స్‌ సమయానికి కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యమయ్యిందా ఆచార్య పుత్రా అంటూ చివరి పది నిమిషాలలో కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం పూనకాలతో ఊగిపోయింది. అంతేకాక పార్ట్‌ 2లో ప్రభాస్‌.. కర్ణుడిగా కనిపించబోతున్నారని అర్థం అవుతోంది. ఇక తాజాగా నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌తో దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి పార్ట్ 2లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతోనే నాగ్ అశ్విన్.. ప్రభాస్ భైరవ.. ఇప్పుడు K అంటూ ట్వీట్‌ చేశాడని భావిస్తున్నారు నెటిజనులు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio