iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: ప్రియాంకను పెళ్లి చేసుకోకపోతే.. కల్కి సినిమా వచ్చేది కాదా.. నాగ్‌ అశ్విన్‌ ఏమన్నారంటే!

  • Published Jul 06, 2024 | 9:20 AM Updated Updated Jul 06, 2024 | 9:20 AM

Nag Ashwin: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ తెలుగు మీడియాతో ముచ్చటించారు. అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు..

Nag Ashwin: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ తెలుగు మీడియాతో ముచ్చటించారు. అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు..

  • Published Jul 06, 2024 | 9:20 AMUpdated Jul 06, 2024 | 9:20 AM
Kalki 2898 AD: ప్రియాంకను పెళ్లి చేసుకోకపోతే.. కల్కి సినిమా వచ్చేది కాదా.. నాగ్‌ అశ్విన్‌ ఏమన్నారంటే!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా కల్కి సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చూపించిన పురాణ పాత్రలపై సోషల్‌ మీడియా వేదికగా జోరుగా చర్చ సాగుతోంది. కొందరు నాగ్‌ అశ్విన్‌ విజన్‌ని అభినందిస్తూంటే.. మరి కొందరేమో.. భారతం గురించి ఏం తెలియకుండానే నాగ్‌ అశ్విన్‌ కల్కి సినిమాను తెరకెక్కించాడు అని విమర్శిస్తున్నారు. అవన్ని పక్కకు పెడితే.. హాలీవుడ్‌ను తలదన్నే రీతిలో.. తెర మీద విజువల్‌ వండర్‌గా కల్కిని చూపించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

ఇక కల్కి కలెక్షన్స్‌ చూసి ఇండియన్‌ బాక్సాఫీస్‌ నివ్వెరపోతుంది. అతి తక్కువ ప్రమోషన్‌ కార్యక్రమాలతో.. రిలీజైన ఈ చిత్రం.. భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుంది. వారం రోజుల్లోనే 7 వందల కోట్లు కలెక్ట్‌ చేసి పాత రికార్డులను బద్దలు కొట్టింది. కల్కి భారీ విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కల్కి చిత్రం, పార్ట్‌ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nagaswin wife

ఇక మీడియా సమావేశంలో రిపోర్టర్లు నాగ్‌ అశ్విన్‌కు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికి ఆయన చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనకు ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే ఒకవేళ ప్రియాంక దత్‌ను మీరు పెళ్లి చేసుకోకపోతే కల్కి సినిమా మీరు చేయగలిగేవారా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే దానికి నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ఈ ప్రశ్నకు నాగి బదులిస్తూ.. ప్రియాంకతో పెళ్లి జరగకపోయి ఉంటే.. బహుశా కల్కి సినిమాను చేయలేకపోయే వాడినేమోనని అన్నారు. ముందుగా ఈ విషయంలో తన కుటుంబ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక తాను అల్లుడిని అయినా సరే వాళ్లకు ఒక దర్శకుడు లాగానే పనిచేశాననే అర్థం వచ్చేలా నాగ్‌ అశ్విన్‌ సమాధానం ఇచ్చారు.

NagAswin Wife

వైజయంతి మూవీస్ బ్యానర్‌ ప్రారంభించి 50 సంవత్సరాలు కావోస్తున్న సమయంలో వచ్చిన సినిమా కల్కి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా, భారతీయ సినీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా అని చెప్పుకొచ్చారు నాగ్‌ అశ్విన్‌. అయినా సరే బడ్జెట్‌ విషయంలో ప్రియాంక, స్వప్నా దత్‌లు ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా నిర్మాణం విషయంలో ముందుకు వచ్చారని.. ఇప్పటికే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసే అంత కలెక్షన్స్ రావడంతో చాలా కృతజ్ఞతతో ఉంటానని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు.

ఇక అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్‌ను.. నాగ్ అశ్విన్ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, ఇప్పుడు కల్కి. ఇవన్ని బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş