iDreamPost
android-app
ios-app

అఫీషియల్: మైత్రీ మూవీ మేకర్స్- అజిత్ కుమార్ టైటిల్ ఇదే!

  • Published Mar 14, 2024 | 7:07 PM Updated Updated Mar 14, 2024 | 7:07 PM

Ajith Kumar- Mythri Movie Makers: అజిత్ కుమార్- మైత్రీ మూవీ మేకర్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ మూవీ టైటిల్ ని రిలీజ్ చేశారు.

Ajith Kumar- Mythri Movie Makers: అజిత్ కుమార్- మైత్రీ మూవీ మేకర్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ మూవీ టైటిల్ ని రిలీజ్ చేశారు.

  • Published Mar 14, 2024 | 7:07 PMUpdated Mar 14, 2024 | 7:07 PM
అఫీషియల్: మైత్రీ మూవీ మేకర్స్- అజిత్ కుమార్ టైటిల్ ఇదే!

అజిత్ కుమార్ కు సౌత్ లో ఉండే క్రేజ్ అంతా ఇతా కాదు. ముఖ్యంగా టాలీవుడ్ లో కూడా అజిత్ కుమార్ కు పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. తమిళ్ లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో.. అజిత్ సినిమాలకు తెలుగులో కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు అజిత్ తన 63వ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తో చేయబోతున్నాడు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. అందుకు సంబందించి టైటిల్ ని కూడా రివీల్ చేశారు. ఇవాళ 6.31 గంటలకు అగ్నిపర్వతం బద్దలు కాబోతోంది అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు.

మైత్రీ మూవీ మేకర్స్ అప్ డేట్ ఏంటి అని మాత్రం చెప్పలేదు. సడెన్ గా అజిత్ కుమార్ మూవీ టైటిల్ ని రివీల్ చేశారు. ఈ విషయం తెలియగానే అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే సినిమా పేరే కాదు.. ఆ పోస్టర్ ను చూస్తే కథ ఏంటో అర్థమైపోతోంది. అసలు టైటిల్ ఏంటంటే.. ‘గుడ్- బ్యాడ్- అగ్లీ’ అని పెట్టారు. అంతేకాకుండా టైటిల్ పోస్టర్ డిజైన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. పోస్టర్ లో ఫెన్సింగ్, గన్స్ ఉన్నాయి. టైటిల్ లో అగ్లీ పదాన్ని ‘నకుల్ పంచ్’తో డిజైన్ చేశారు. మొత్తానికి ఈ మూవీ రక్తపాతం, వైలెన్స్ అధికంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి డీఎస్పీ సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కాబోతోంది. అలాగే ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాం అంటూ ముందే ప్రకటించేశారు. టైటిల్స్ మాత్రం ఇంగ్లీష్, తమిళ్ లో మాత్రమే విడుదల చేశారు. అంటే ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నట్లు ఉన్నారు. అధిక్ రవిచంద్రన్ ఇటీవల విశాల్ తో మార్క్ ఆంటోని అనే ఫాంటసీ, సైన్స్ చిత్రం తీశాడు. ఇప్పుడు అజిత్ తో ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నాడో చూడాలి. పోస్టర్ ని మాత్రం రక్తంతో ఎర్రగా మార్చేశాడు. మరి.. అజిత్ కుమార్ 63వ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio