iDreamPost
android-app
ios-app

Hero: నా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.. అందుకే ఆ పని చేస్తున్నా: సందీప్‌ కిషన్‌

  • Published Feb 14, 2024 | 12:13 PM Updated Updated Feb 14, 2024 | 12:30 PM

సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన ఓ యంగ్ హీరో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే ఆ పని చేస్తున్నా అని ఆయన చెప్పాడు. ఇంతకి ఆయనేవరంటే..

సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన ఓ యంగ్ హీరో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే ఆ పని చేస్తున్నా అని ఆయన చెప్పాడు. ఇంతకి ఆయనేవరంటే..

  • Published Feb 14, 2024 | 12:13 PMUpdated Feb 14, 2024 | 12:30 PM
Hero: నా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.. అందుకే ఆ పని చేస్తున్నా: సందీప్‌ కిషన్‌

సాధారణంగా వెండితెర పై మెరిసే సెలబ్రిటీలను చూస్తే.. బోల్డంత ఆస్తి, మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని అందరూ అనుకుంటారు. నిజానికి తెర పై రంగు పూసుకుని నటించే వారి జీవితాల వెనుక అనేక ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉంటాయి. వాళ్లు కూడా అనేక సమస్యలు, సవాళ్లు అంటూ ఎదుర్కొంటారు. ఆకలితో కడుపు మడ్చుకునే రోజులు, మరెన్నో నిద్దరలేని రాత్రులు, పొట్ట కూటి కోసం రకరకాల పనులు చేసేవారు కూడా ఉంటారు. అయితే వాటన్నింటిని బయటపెట్టినప్పుడు మాత్రమే అభిమానులకు వారి కష్టాలు తెలుస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి దీనస్థితిలో ఉన్నవారు, అనేక కష్టాలను ఎదుర్కొంటున్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఓ యంగ్ హీరో కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులే పడుతున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. అయితే.. మొదటిసారి ఆ హీరో కూడా తన ఫర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆయనేవరంటే..

ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా ఈ యంగ్ హీరో  ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని చర్చలు మొదలయ్యాయి. ఇంతకి ఆయనేవరంటే హీరో ‘సందీప్ కిషన్’. ఈయన తాజాగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవ కోన’. ఈ సినిమా ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు సందీప్. దీంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా.. తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో కూడా  తన ఆర్థిక పరిస్థితి ఏమి బాగోలేదని చెప్పడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. సహజంగా ఒక కుర్ర హీరో.. తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో అతిథి పాత్ర చేస్తున్నాడంటే.. అందుకు మూడు కారణాలు ఉంటాయి. ఒకటి ఆ తాను గెస్ట్ రోల్ చేస్తున్నా సినిమాలో హీరోతో ఉన్న అనుబంధం అయిన ఉండాలి, రెండు కథ బాగా నచ్చడం, మూడోది ఆర్థికంగా ఇబ్బందులైన ఉండాలి. ఈ క్రమంలోనే సందీప్ కూడా డబ్బు లేకనే గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు.

‘నేను సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తుంది డబ్బు కోసమే. గత కొంతకాలంగా నేను చాలా ఆర్థికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్ లో కూడా పెట్టుబడి పెట్టాను. వారందరికీ జీతాలు ఇవ్వాలి. వారికీ జీతాలు ఇవ్వడానికే నేను ఇలా గెస్ట్ రోల్స్ సినిమాలు చేస్తున్నాను’. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాతో అయిన సందీప్ ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవాలని కోరుకుంటున్నారు. మరి, సందీప్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet