iDreamPost
android-app
ios-app

Murari Collections: మురారి దెబ్బకి ఖుషి ప్రీ రిలీజ్ రికార్డ్స్ బ్రేక్! ఫైనల్ కలెక్షన్స్ వచ్చేశాయి!

  • Published Aug 14, 2024 | 12:57 PM Updated Updated Aug 14, 2024 | 1:06 PM

Murari Movie Re Release Collections: రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సంధర్బంగా మురారి మూవీ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ మూవీ మరో రికార్డు ను బ్రేక్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Murari Movie Re Release Collections: రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సంధర్బంగా మురారి మూవీ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ మూవీ మరో రికార్డు ను బ్రేక్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 14, 2024 | 12:57 PMUpdated Aug 14, 2024 | 1:06 PM
Murari Collections: మురారి దెబ్బకి ఖుషి  ప్రీ రిలీజ్ రికార్డ్స్ బ్రేక్! ఫైనల్ కలెక్షన్స్ వచ్చేశాయి!

ఈ మధ్య కాలంలో వచ్చిన రీరిలీజ్ లలో.. మురారి మూవీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసిందని చెప్పి తీరాల్సిందే. మూవీ రిలీజ్ కు ముందు సోషల్ మీడియాలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. ఒక పెళ్ళికి చేసినట్లు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ , వీడియోస్ రెడీ చేయడంతో పాటు.. రీరిలీజ్ రోజును థియేటర్స్ దగ్గర పెళ్లి పందిరి వేయడం , అత్యుత్సాహానికి పోయి కొంతమంది ఏకంగా పెళ్ళి చేసుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మురారి మూవీ రీరిలీజ్ క్రియేట్ చేసిన సందడి ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు వీటితో పాటు రీరిలీజ్ కలెక్షన్స్ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది మురారి మూవీ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటివరకు రీరిలీజ్ లలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఏదైనా ఉందంటే.. అది పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీ.. ఈ సినిమా రీరిలీజ్ లో రూ.7.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు మహేష్ మురారి మూవీ రిలీజ్ అయ్యి.. ఈ రీరిలీజ్ కలెక్షన్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. రీరిలీజ్ అయినా దగ్గర నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.8.31 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది మురారి మూవీ. ఇప్పటివరకు ఖుషి మూవీ రికార్డ్స్ ను ఏ మూవీ బ్రేక్ చేస్తుందా అని అనుకున్న వారికి.. మురారి సైలెంట్ గా రీరిలీజ్ సెన్సేషనల్ రికార్డ్స్ తో సమాధానం చెప్పేసింది. దీనితో మహేష్ రీరిలీజ్ సినిమాలకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో.. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలను రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి ఎలాంటి మూవీని రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.

kushi

ఇక మరో వైపు.. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మహేష్ రాజమౌళి పేర్లు తప్ప.. వేరే ఏ అప్ డేట్ ఇప్పటివరకు రాలేదు. రీసెంట్ గా సినిమా టైటిల్ కు సంబందించిన అప్ డేట్ వచ్చినా కూడా అది కేవలం బజ్ గానే మిగిలిపోయింది. మూవీ షూటింగ్ కు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. ఈ కాంబినేషన్ మీద ఇప్పటికే అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఇప్పుడు మహేష్ రీరిలీజ్ మూవీ మురారి క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/