iDreamPost
android-app
ios-app

పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి.. 100 కోట్ల క్లబ్ లో చేరిన చిన్న సినిమా!

Munjya Movie: కంటెంట్ కరెక్టగా ఉంటే చిన్న సినిమా అయినా సరే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. అలా హిట్ కొట్టిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో చిన్న సినిమా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

Munjya Movie: కంటెంట్ కరెక్టగా ఉంటే చిన్న సినిమా అయినా సరే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. అలా హిట్ కొట్టిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో చిన్న సినిమా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి.. 100 కోట్ల క్లబ్ లో చేరిన చిన్న సినిమా!

ఇటీవల కాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ లు సొంతం చేసుకుంటున్నాయి. సెలెంట్ గా థియేటర్లలోకి వచ్చి..హిట్ టాక్ తో భారీ వసూలు సాధిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. నటీనటులతో సంబంధం లేకుండా కంటెంట్ కరెక్టగా ఉంటే చిన్న సినిమా అయినా సరే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. అలా హిట్ కొట్టిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో చిన్న సినిమా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. పెద్ద సినిమాను సైతం వెనక్కి నెట్టి 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి.. ఆ చిత్రం ఏమిటి, ఆ వివరాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం..

ముంజా…మూవీ.. గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా బాక్సఫీస్ దగ్గర ఈ సినిమా అదరగొడుతుంది.  బాలీవుడ్ లో పెద్ద సినిమాల నుంచి వచ్చ పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడింది. హారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. జూన్ 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చి..హిట్ టాక్ రావడంతో ఇక భారీగా కలెక్షన్లు రాబట్టింది.  చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఈ ముంజా సినిమాకు ఓటేస్తున్నారు. అలా ఈ చిత్రం 17 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది.

ముంజా సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారిక పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. ఆదిత్య సపోట్‌దర్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మోనా సింగ్‌, అభయ్‌ వర్మ, శార్వరి వాగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కలెక్షన్లలో దూకుడు మీద ఉన్న ముంజాకు గురువారం అంటే జూన్ 27వ తేదీన అడ్డుకట్ట పడే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆ రోజు ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో ముంజా రేసులో వెనకబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా విడుదలైన ముంజా పెద్ద పెద్ద సినిమాలను వెనక్కి నెట్టింది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, చందు ఛాంపియన్‌ వంటి భారీ చిత్రాలను కూడా వెనక్కు నెట్టి సెంచరీ క్లబ్ చేరింది. కేవలం 30కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.