Dharani
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి మరో షాక్ తగిలింది. ఆమె మీద పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.. అది కూడా కోర్టు ఆదేశాల మేరకు. ఎందకంటే..
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి మరో షాక్ తగిలింది. ఆమె మీద పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.. అది కూడా కోర్టు ఆదేశాల మేరకు. ఎందకంటే..
Dharani
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. వెంకటేష్ సాహస వీరుడు సాగర కన్య చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింద ఈ పొడుగు కాళ్ల సుందరి. ఆ తర్వాత ఆజాద్, వీడెవడండీ బాబూ, భలేవాడివి బాసు వంటి చిత్రాల్లో నటించింది. దక్షిణాదికి చెందని ఈ భామకు సౌత్‌లో మాత్రం తగినతంగ గుర్తింపు రాలేదు. ఈ కన్నడ కస్తూరి.. బాలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా రాణించింది. ఆ తర్వాత బిగ్‌బ్రదర్ షోలో పాల్గొని.. వివక్ష ఎదుర్కొంది. ఈ షోలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఐపీఎల్ టీమ్ ఒనర్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం ఉన్నారు. ప్రస్తుతం టీవీ షోలకు జడ్జీగా, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో శిల్పా శెట్టికి భారీ షాక్ తగిలింది. ఆమెపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఆ వివరాలు..
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు.. పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు ఆమె మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. గోల్డ్ స్కీమ్‌తో(బోగస్ బంగారం పథకం) తనను మోసగించారంటూ ఓ వ్యాపారి శిల్పా శెట్టి, ఆమె భర్త మీద ఆరోపణలు చేశాడు. అంతేకాక వారిద్దరి మీద ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ముంబయి అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా.. శిల్పా శెట్టి మీద చీటింగ్ కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని పేర్కొన్నారు.
కాగా, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు సహా వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి తనను మోసం చేశారంటూ.. రిద్ధి సిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారీ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో వీరు మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి కూడా నిర్ధారించారు. దీనిపై పూర్థి స్థాయిలో దర్యాప్తు చేయాలని బీకేసీ పోలీస్ స్టేషన్‌ను అదేశించారు. మరి ఈ వివాదంపై శిల్పా శెట్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక గతంలో కూడా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా మీద చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. . శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ప్రారంభించిన ఫిట్‌నెస్ ఎంటర్‌ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్టు గతంలో వీరి మీద ఆరోపణలు వచ్చాయి. దీనిలో భాగంగా శిల్పా శెట్టి దంపతులు తన దగ్గర నుంచి 1.51 కోట్ల రూపాయలు తీసుకున్నారని.. ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నానడంటూ ఓ వ్యాపారవేత్త ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.