iDreamPost
android-app
ios-app

విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో MS ధోనీ?

  • Published Mar 30, 2024 | 5:35 PM Updated Updated Mar 30, 2024 | 5:35 PM

MS Dhoni In Vijay Movie: దళపతి విజయ్ సినిమాకి సంబంధించి క్రేజీ క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ కాస్ట్ ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో ఇంకో సూపర్ స్టార్ వచ్చి చేరుతున్నట్లు చెబుతున్నారు.

MS Dhoni In Vijay Movie: దళపతి విజయ్ సినిమాకి సంబంధించి క్రేజీ క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ కాస్ట్ ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో ఇంకో సూపర్ స్టార్ వచ్చి చేరుతున్నట్లు చెబుతున్నారు.

  • Published Mar 30, 2024 | 5:35 PMUpdated Mar 30, 2024 | 5:35 PM
విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో MS ధోనీ?

దళపతి విజయ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతానికి సినిమాలు కూడా వేగంగానే పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతానికి విజయ్ అనౌన్స్ చేసిన సినిమాల్లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) మూవీ కూడా ఒకటి ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. గోట్ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో చాలామందే స్టార్స్ ఉన్నారు. ప్రభుదేవా, వైభవ్, యోగిబాబు, అజ్మల్, ప్రేమ్ జీ, స్నేహా, లైలా, మైక్ మోహన్, మీనాక్షీ శేషాద్రి వంటి ఎంతోమంది స్టార్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. పైగా ఈ మూవీలో విజయ్ తండ్రి, కుమారుడిగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఆర్మీ, స్పెషల్ ఫోర్సెస్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అది విన్న తర్వాత ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

దళపతి విజయ్ సినిమాలకు పాన్ ఇండియా లెవల్లో మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ లో విజయ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ కి గ్యారెంటీ హీరో అనే ట్యాగ్ కూడా ఉంది. లియో సినిమా ఒక్క తమిళనాడులోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు రాబోతున్న గోట్ మూవీపై కూడా అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ ద్విపాత్రాభినయం చేయడం, పైగా ఈ మూవీ స్పెషల్ ఫోర్సెస్ నేపథ్యంలో ఉండటంతో అవి నెక్ట్స్ లెవల్ కి చేరాయి. ఇప్పుడు వస్తున్న వార్త చూస్తే ఈ మూవీపై ఒక్క తమిళనాడులోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా లవర్స్ మాత్రమే కాదు.. క్రికెట్ ప్రేమికులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూపులు ప్రారంభించేశారు.

dhoni in goat movie

విషయం ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్ ఇప్పటిలే ఇండియాలోనే కాకుండా టర్కీ, థాయ్ ల్యాండ్ లలో కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఇటీవల కేరళో కూడూ గోట్ సినిమా చిత్రీకరణ జరిగింది. ఒక క్రికెట్ గ్రౌండ్ లో సినిమా షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇప్పటివరకు పోరాటాల నేపథ్యంలో వస్తున్న సినిమాలో క్రికెట్ చేరడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సినిమాలో క్రికెట్ కూడా ఒక భాగం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఈ గోట్ సినిమాలో నటిస్తున్నారు అంటున్నారు. ఇది అధికారికంగా తెలియకపోయినా.. వార్తలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. ఈ మూవీలో ధోనీ అతిథి పాత్ర చేస్తున్నాడు అంటున్నారు.

డైరెక్టర్ వెంకట్ ప్రభుకి క్రికెట్ అంటే అభిమానం అని అందరికీ తెలిసిందే. ఇలా క్రికెట్ గ్రౌండ్ లో షూటింగ్ అనగానే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అలాగే గతంలో ఈ సినిమాపై చాలానే రూమర్స్ వచ్చాయి. వాటికి కూడా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా హలీవుడ్ మూవీకి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదంటూ వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా టైమ్ ట్రావెలర్ కథ అని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అది కూడా నిజం కాదని చెప్పారు. ఇది ఒరిజినల్ ఫిల్మ్ అని.. ఇందులో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ గోట్ సినిమాలో ధోనీ గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనే వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. మరి.. గోట్ మూవీలో ధోనీ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş