iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో సినిమా కోసం విలన్ గా మారబోతున్న ధోని?

  • Author ajaykrishna Updated - 03:30 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Updated - 03:30 PM, Thu - 17 August 23
స్టార్ హీరో సినిమా కోసం విలన్ గా మారబోతున్న ధోని?

ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెటర్స్ చాలామంది గెస్ట్ అప్పియరెన్స్ ద్వారా అయినా స్క్రీన్ పై కనిపించి వెళ్తున్నారు. అలా ఆల్రెడీ హార్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ధావన్ లాంటి పాపులర్ క్రికెటర్స్ సినిమాలలో నటులుగా భాగమైపోయారు. ఇప్పుడు స్టార్ క్రికెటర్.. మాజీ సారధి ఎంఎస్ ధోని.. యాక్టర్ గా డెబ్యూకి రెడీ అవుతున్నాడట. దీంతో తమ అభిమాన క్రికెటర్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధోని ఆల్రెడీ తన పేరు మీద.. ధోని ఎంటర్టైన్మెంట్స్ అని ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాగా LGM మూవీ నిర్మించగా.. అది ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించింది.

ఇక నిర్మాతగా మారాడు కాబట్టి.. ఇప్పుడు ధోని నటుడిగా మారే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్తున్న విషయం విదితమే. లోకేష్ కనగరాజ్ తో లియో పూర్తి చేసిన విజయ్.. తన 68వ సినిమాగా వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే.. ఇప్పటికే వీరి కాంబినేషన్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా జ్యోతిక నటించనుందని టాక్ వినిపిస్తుంది. వీరి కాంబినేషన్ లో గతంలో బ్లాక్ బస్టర్ ఖుషి వచ్చింది. దాదాపు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరి కాంబో సెట్ అవుతుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. వెంకట్ ప్రభు సినిమాలో విజయ్ కి విలన్ గా ధోని నటించబోతున్నాడట. విజయ్ కి ధీటుగా విలనిజం పండించేందుకు ధోని రెడీ అవుతున్నాడని కోలీవుడ్ కోడైకూస్తోంది. ఆ మధ్య సాక్షి సింగ్ కూడా.. మంచి కథ దొరికితే.. ధోని కూడా నటుడిగా ఎంట్రీ ఇస్తారని చెప్పింది. దీంతో వెంటనే దళపతి కోసం కథ ఓకే అనుకున్నాక.. వెంకట్ ప్రభు వెళ్లి ధోనికి కూడా కథ వినిపించాడని.. అందులో విలన్ రోల్ కోసం ధోనిని ఒప్పించాడని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే.. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. అందులోనూ ధోని ఆల్రెడీ కమర్షియల్ యాడ్స్ చేస్తూ నటనపై తనకున్న ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నాడు. సో.. ధోని నటుడిగా డెబ్యూ చేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. మరి ధోని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom