iDreamPost
android-app
ios-app

పెళ్లిపై మరోసారి మృణాల్‌ ఠాకూర్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్‌!

మృణాల్‌ ‘హాయ్‌ నాన్న’ సినిమాలో నానికి జంటగా నటించారు. సినిమా విడుదలకు చాలా టైం ఉన్నా.. సినిమా టీం మాత్రం ప్రమోషన్లను ఇప్పటినుంచే మొదలుపెట్టింది.

మృణాల్‌ ‘హాయ్‌ నాన్న’ సినిమాలో నానికి జంటగా నటించారు. సినిమా విడుదలకు చాలా టైం ఉన్నా.. సినిమా టీం మాత్రం ప్రమోషన్లను ఇప్పటినుంచే మొదలుపెట్టింది.

పెళ్లిపై మరోసారి మృణాల్‌ ఠాకూర్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్‌!

డెబ్యూ సినిమాతోనే తెలుగులో పిచ్చ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌. ‘ సీతారామం’ సినిమాతో ఒక్క తెలుగులోనే కాదు.. మొత్తం సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీతారామం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఆమె నటించిన ‘ ఫ్యామిలీ స్టార్‌’, ‘ హాయ్‌ నాన్న’ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మృణాల్‌ ‘హాయ్‌ నాన్న’ సినిమాలో నానికి జంటగా నటించారు. సినిమా విడుదలకు చాలా టైం ఉన్నా.. సినిమా టీం మాత్రం ప్రమోషన్లను ఇప్పటినుంచే మొదలుపెట్టింది. పాటలు, ట్రైలర్‌, టీజర్‌ ఇలా ఏదో  ఒక కార్యక్రమంతో నాని, మృణాల్‌లు సినిమా ప్రమోషన్‌ చేస్తున్నారు. తాజాగా, మృణాల్‌, నాని ఓ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు మృణాల్‌ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. మీకు పెళ్లయిందా? అన్న ప్రశ్నకు..

‘‘ నేను ఏదో ఒకరోజు కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నాకు పెళ్లి కాలేదు’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ నాకు వివాహ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. మా ఫ్యామిలీలో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న వారు చాలా మంది ఉన్నారు. నా మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. 18-60 వరకు ఎప్పుడైనా అలాంటి వారు తారసపడొచ్చు’’ అని అన్నారు. మరి, మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet