iDreamPost
android-app
ios-app

Mrunal Thakur: పెళ్లంటే భయం.. పిల్లలంటే ఇష్టం.. అందుకే ఆ పని చేశాను!

  • Published Apr 26, 2024 | 12:55 PM Updated Updated Apr 26, 2024 | 1:09 PM

సీతారామం సినిమాతో తెలుగు వారి మదిని దోచేసుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తాజాగా ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. వాటిలో తనకు పుట్టబోయే పిల్లల విషయంలో మృణాల్ తీసుకున్న నిర్ణయం చూసి అందరు షాక్ అవుతున్నారు.

సీతారామం సినిమాతో తెలుగు వారి మదిని దోచేసుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తాజాగా ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. వాటిలో తనకు పుట్టబోయే పిల్లల విషయంలో మృణాల్ తీసుకున్న నిర్ణయం చూసి అందరు షాక్ అవుతున్నారు.

  • Published Apr 26, 2024 | 12:55 PMUpdated Apr 26, 2024 | 1:09 PM
Mrunal Thakur: పెళ్లంటే భయం.. పిల్లలంటే ఇష్టం.. అందుకే ఆ పని చేశాను!

కొంతమంది హీరోయిన్స్ తీసింది కొన్ని సినిమాలే అయినా కానీ.. ప్రేక్షకులలో మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా కానీ.. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు వారి మదిలో చోటు సంపాదించుకున్న హీరోయిన్ మాత్రం.. కేవలం ఒక్కరే ఉన్నారు. ఆమె మరెవరో కాదు సీతా మహాలక్ష్మిగా అచ్చ తెలుగు అమ్మాయిలా తెలుగు వారికి పరిచయం అయినా మృణాల్ ఠాకూర్. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో ఈ అమ్మడు.. అందరిని కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో ఈమెకు అనేక ఆఫర్లు వచ్చిపడ్డాయి. వాటిలో చాలా సెలెక్టివ్ గానే సినిమాలు చేసుకుంటూ వస్తుంది మృణాల్. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ తనకు పుట్టబోయే పిల్లల విషయంలో కొన్ని ఆశక్తి కర కామెంట్స్ చేసింది. దీనితో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగులో సీతారామం సినిమా తర్వాత.. నానితో హాయ్ నాన్న సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్.. ముచ్చటగా మూడవ సినిమా విజయ్ దేవరకొండతో కలిసి నటించింది, మొదటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ ను సాధించగా.. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా మిక్సెడ్ టాక్ సంపాదించుకుంది. అయితే సినిమా పరంగా ఎలా ఉన్నా కూడా.. నటన పరంగా మృణాల్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం మృణాల్ కు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక మీడియా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక తాజగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. కెరీర్, లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది.

పిల్లలను కనే విషయంలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. “కెరీర్, లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మనం ఎప్పుడూ దానిని ఎలా చేయాలన్నదాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రిలేషేన్ షిప్స్ అంటే కష్టమన్న విషయం నాకు తెలుసు. మనం చేసే పనిని అర్థం చేసుకునే భాగస్వామిని పొందడం చాలా అవసరం. ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి కెరీర్ పైనే నా దృష్టి. ఒక స్టేజ్ దాటిన తర్వాత.. నిల్వ చేసిన అండాలతో పిల్లలను కనడం ఇపుడు కామన్ అయిపొయింది.” అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఏదేమైనా సెలెబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలు బయటపెట్టినపుడు.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మృణాల్ కామెంట్స్ కూడా నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio