iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫౌజీ మూవీలో మృణాళ్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చేసింది..

  • Published Aug 14, 2024 | 3:03 PM Updated Updated Aug 14, 2024 | 3:03 PM

Mrunal Thakur Clarity On Prabhas- Hanu Raghavapudi Project: ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటి నుంచే ప్రభాస్- హను రాఘవపూడి ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ అని వస్తున్న వార్తలపై స్వయంగా హీరోయిన్ స్పందించింది.

Mrunal Thakur Clarity On Prabhas- Hanu Raghavapudi Project: ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటి నుంచే ప్రభాస్- హను రాఘవపూడి ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ అని వస్తున్న వార్తలపై స్వయంగా హీరోయిన్ స్పందించింది.

  • Published Aug 14, 2024 | 3:03 PMUpdated Aug 14, 2024 | 3:03 PM
ప్రభాస్ ఫౌజీ మూవీలో మృణాళ్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చేసింది..

డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం వరుస సనిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒక మూవీ షూటింగ్ లో ఉండగానే.. రెండో మూవీని కూడా స్టార్ట్ చేసేస్తున్నాడు. కల్కి సినిమా తీస్తున్నప్పుడే రాజాసాబ్ షూట్ లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఫార్ములానే వాడుతూ.. రెండు రెండు ప్రాజెక్టులు చేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ఏదైతే ఇయర్ రెండు సినిమాలతో వస్తాను అని చెప్పాడో.. అలాగే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్- హను రాఘవపూడి ప్రాజెక్ట్ పై ఒక వార్తా బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ చేస్తోంది అని. అయితే ఆ విషయంపై స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చేసింది.

ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో సినిమా ఒక సెట్ అయిన విషయం తెలిసిందే. ఆ మూవీకి అధికారికంగా ఎలాంటి పేరు పెట్టలేదు. కానీ, సినిమా పేరు మాత్రం ఫౌజీ అని ప్రచారంలో ఉంది. అంతేకాకుండా.. ఆ సినిమాలో హనురాఘవపూడి చేసిన సీతారామం హీరోయిన్ మృణాళ్ ఠాకూరే ఈ మూవీలో కూడా ఫీమేల్ లీడ్ అంటూ వార్తలు వచ్చాయి. ఒకసారి హను రాఘవపూడితో పనిచేసి ఉండటం.. పైగా తెలుగు ప్రేక్షకుల్లో మృణాళ్ కు మంచి ఫ్యాన్స్ బేస్ క్రియేట్ కావడంతో ఆ వార్తలకు మంచి పాపులారిటీ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫిల్మ్ ఫేర్ అని ఉన్న ఒక పేజ్ లో ప్రభాస్- మృణాళ్ పిక్స్ షేర్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఆ పోస్టుకు స్వయంగా మృణాళ్ ఠాకూరు కామెంట్ పెట్టింది.

Mrunal into Fauji

ఫిల్మ్ ఫేర్ అనే ఇన్ స్టా పేజ్ లో ప్రభాస్- హనురాఘవపూడి ఫౌజీ సినిమాలో మృణాళ్ చేస్తోంది అంటూ వాళ్ల పోస్ట్ సారాంశం. అయితే మృణాళ్ ఠాకూర్ “ఈ వైబ్ ని కిల్ చేస్తున్నందకు క్షమించండి. కానీ, నేను ఆ మూవీలో చేయడం లేదు” అంటూ కామెంట్ చేసింది. ఇంకేముంది.. ప్రభాస్ సరసన మృణాళ్ ఠాకూర్ అంటూ వస్తున్న వార్తలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. మృణాళ్ గనుక రెస్పాండ్ కాకపోతే ఈ వార్తలు వైరల్ అవుతూనే ఉండేవి. స్వయంగా ఆవిడే స్పందించడంతో పుకార్లకు బ్రేకులు పడ్డట్లు అయ్యింది. ఇంక ప్రభాస్- హను రాఘవపూడి సినిమా కూడా యుద్ధం నేపథ్యంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సుభాష్ చంద్రబోస్ తో కలిసి ప్రభాస్ యుద్ధంలో పాల్గొంటాడు అంటున్నారు. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుందని వార్తలు అయితే వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom