iDreamPost
android-app
ios-app

ఆగస్టు 15కి విడుదలైన 4 చిత్రాల్లో.. ఏ సినిమా బెటరంటే?

Mr Bachchan vs Double Ismart vs Thangalaan vs AAY Which Movie Is Better: ఆగస్టు 15కు తెలుగు ప్రేక్షకుల ముందుకు మొత్తం నాలుగు సినిమాలు వచ్చేశాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో కూడా ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఏ మూవీ బెటరో చూద్దాం.

Mr Bachchan vs Double Ismart vs Thangalaan vs AAY Which Movie Is Better: ఆగస్టు 15కు తెలుగు ప్రేక్షకుల ముందుకు మొత్తం నాలుగు సినిమాలు వచ్చేశాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో కూడా ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఏ మూవీ బెటరో చూద్దాం.

ఆగస్టు 15కి విడుదలైన 4 చిత్రాల్లో.. ఏ సినిమా బెటరంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 15కి సినిమాల జాతర జరిగింది. పాన్ ఇండియా లెవల్లో ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 సినిమాలు వచ్చేశాయి. రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్, రామ్- పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ వచ్చేసింది. ఇంక కోలీవుడ్ నుంచి చియాన్ విక్రమ్ తంగలాన్ తో వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నె నితిన్ కూడా ఆయ్ సినిమాతో వచ్చేశాడు. మరి.. ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు ఏ మూవీకి వెళ్లాలి? అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. అలాంటి కన్ఫ్యూజన్ మీకు కూడా ఉంటే ఈ నాలుగు మూవీల్లో ఏది బెటర్ గా ఉందో తెలుసుకోండి.

మిస్టర్ బచ్చన్:

రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా కథ అందరికీ తెలిసిందే. అజయ్ దేవ్ గన్ రైడ్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. అయితే కథలో చాలానే మార్పులు చేశారు. ఆ మూవీలో లేని లవ్ ట్రాక్ ని మిస్టర్ బచ్చన్ లో చూపించారు. ఇంక హరీశ్ శంకర్ మార్క్ డైలాగ్స్ కూడా సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ లో సినిమాకి మంచి మార్కులే పడ్డాయి. ఎడిటింగ్, బీజీఎం, హరీశ్ డైలాగ్స్ ఫస్టాఫ్ డీసెంట్ అనిపించుకుంది. కానీ, సెకండాఫ్ లో మాత్రం సినిమా తేలిపోయింది. హీరో- విలన్ మధ్య ఉండే సంఘర్షణను మెరుగ్గా చూపించలేదు అనే భావన కలుగుతుంది. విలన్ తేలిపోవడం, సినిమాని చుట్టేశారు అనే భావన రావడంతో బచ్చన్ గ్రాఫ్ పడిపోయింది.

డబుల్ ఇస్మార్ట్:

ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్టుగా నిలిచాక.. డబుల్ ఇస్మార్ట్ మీద అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. మళ్లీ మ్యాజిక్ చేస్తారని ప్రేక్షకులు అంతా భావించారు. కానీ, ఎక్కడో పూరి జగన్నాథ్ మ్యాజిక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ సినిమా గ్రాఫ్ ని పైపైకి తీసుకెళ్తే.. సెంకడాఫ్ మాత్రం దానిని కిందకి లాగుతూ వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ కూడా సెకండాఫ్ ని చుట్టేశారు అనే భావన కలుగుతుంది. అలాగే పూరి తీసిన కొన్ని లాజిక్ లేని సీన్స్ కాస్త ఇబ్బంది పెడతాయి. రామ్ పోతినేని ఎనర్జీ, కావ్య థాపర్ గ్లామర్ మాత్రం మెప్పిస్తాయి. కానీ, ఓవరాల్ గా సినిమాని చూసుకుంటే మాత్రం ఫ్యాన్స్ ని నిరాశ చెందేలా చేశారు.

తంగలాన్:

తంగలాన్ సినిమా ఒక భారీ ప్రయోగం అనే చెప్పాలి. ఎందుకంటే టెక్నికల్ గా తంగలాన్ ఒక బ్రిలియంట్ సినిమా. కానీ.. కథ, కథనంలో ఆడియన్ ని ఎంగేజ్ చేసే పాయింట్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. బ్రిటీష్ వాళ్లు బంగారం నిధి కావాలి అని కోరుకుంటారు. అందుకోసం తంగలాన్(విక్రమ్) సాయం కోరతారు. ఆ బంగారాన్ని తవ్వేందుకు ఒప్పుకుంటాడు. బంగారం కోసం వాళ్లు చేసే ప్రయాణంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. వినడానికి కథ బాగానే ఉన్నా చూడాలి అంటే కాస్త ఓపిక కావాలి. ఎందుకంటే ఇందులో సాగదీత సన్నివేశాలే ఎక్కువ ఉంటాయి. ప్రయోగం బాగున్నా.. ఫలితం మాత్రం ప్రతికూలంగానే వచ్చింది. కానీ, విక్రమ్ ఎఫర్ట్స్ కి మాత్రం మెచ్చుకోవాల్సిందే.

ఆయ్:

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ రెండో చిత్రం ఆయ్. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఫుల్ ఆన్ కామెడీ లైన్ తో ఈ చిత్రం వచ్చింది. ఇప్పుడున్న పోటీలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు అంటే కంటెంట్ మీద వారికి ఉన్న నమ్మకం అనే చెప్పాలి. ఈ చిత్రానికి డీసెంట్ టాక్ అయితే వచ్చింది. కామెడీతో గిలిగింతలు పెట్టేశారు. ఒక ప్రేమకథ, ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా కూడా పోటీలో గట్టిగానే నిలబడింది. అయితే స్టార్ కాస్ట్, యాక్షన్ ఎలిమెంట్స్ వంటివి కాకుండా.. డీసెంట్ సినిమా చూడాలి అనుకుంటే ఆయ్ మూవీకి వెళ్లచ్చు. ఇంక ఆఖరిగా.. ఈ నాలుగు సినిమాల్లో మీరు ఒక సినిమా చూడాలి అనుకుంటే మాత్రం.. ఆయ్ మూవీ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పుకొవచ్చు.