Nidhan
Mr. Bachchan Movie: మాస్ మహారాజ్ రవితేజ నటించిన కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ సినిమా ప్రీమియర్స్ మొదలైపోయాయి. మూవీలో రవితేజతో పాటు సిద్ధు జొన్నలగడ్డ కూడా రచ్చ చేయడం విశేషం.
Mr. Bachchan Movie: మాస్ మహారాజ్ రవితేజ నటించిన కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ సినిమా ప్రీమియర్స్ మొదలైపోయాయి. మూవీలో రవితేజతో పాటు సిద్ధు జొన్నలగడ్డ కూడా రచ్చ చేయడం విశేషం.
Nidhan
మాస్ మహారాజ్ రవితేజ నటించిన కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ-డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా కావడంతో దీనిపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘మిరపకాయ’ సూపర్ హిట్‌గా నిలవడంతో ‘మిస్టర్ బచ్చన్’ మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. పైగా సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా సూపర్బ్‌గా ఉండటంతో బొమ్మ బ్లాక్‌బస్టర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాంటి ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్స్ షురూ అయిపోయాయి. పంద్రాగస్టు నాడు రిలీజ్ అయినప్పటికీ ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేసేశారు. ఈ సినిమాలో హీరో రవితేజతో పాటు యంగ్ హీరో సిద్ధు జొన్నగలడ్డ క్యారెక్టర్ కూడా అదిరిపోయింది.
‘మిస్టర్ బచ్చన్’లో జూనియర్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్‌గా కనిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. సెకండాఫ్‌లో ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్లో అతడు మెరిశాడు. ఉన్నంత సేపు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. రవితేజ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటే వచ్చి కాపాడతాడు సిద్ధు. ఆ ఎపిసోడ్ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. ఆ సీన్స్‌కు థియేటర్లో ఫ్యాన్స్ నుంచి ఫుల్ విజిల్స్ పడ్డాయి. ‘మిస్టర్ బచ్చన్’లో టిల్లు ఎంటర్టైన్మెంట్ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక, సిద్ధు జొన్నలగడ్డ రోల్‌ను పక్కనబెట్టి సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్ సేఫ్ సైడ్‌లో ఉంటుంది. కంటెంట్ యావరేజ్‌గానే ఉన్నా ఎడిటింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని సీట్లకు కట్టిపడేస్తాయి. కొన్ని చోట్ల సినిమా పరిగెత్తింది. కాగా, ప్రీమియర్స్ కారణంగా ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఏ ఓటీటీలోకి రానుందో క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుందని స్పష్టత వచ్చేసింది. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే తెలిసే ఛాన్స్ లేదు. మేకర్స్‌తో ఓటీటీ పార్ట్నర్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్ణయిస్తారు. సినిమా థియేట్రికల్ రన్ మీద కూడా ఇది డిపెండ్ అవుతుంది. మరి.. ‘మిస్టర్ బచ్చన్ ’ను థియేటర్లలో చూసేందుకు మీరెంతగా ఎందురు చూస్తున్నారో కామెంట్ చేయండి.