iDreamPost
android-app
ios-app

నల్లంచు తెల్లచీర సాంగ్ రిలీజ్.. నిజంగా రవితేజ- భాగ్యశ్రీ అరాచకమే..!

  • Published Aug 12, 2024 | 9:06 PM Updated Updated Aug 12, 2024 | 9:06 PM

Ravi Teja Mr Bachchan Movie Nallanchu Tella Cheera Song: మిస్టర్ బచ్చన్ నుంచి.. మాస్ మసాలా బీట్ ఒచ్చేసింది. తాజాగా విడుదల చేసిన నల్లంచు తెల్లచీర సాంగ్ ఇప్పటి నుంచి సోషల్ మీడియా ట్రెండింగ్ లిస్టులో తప్పకుండా ఉంటుంది.

Ravi Teja Mr Bachchan Movie Nallanchu Tella Cheera Song: మిస్టర్ బచ్చన్ నుంచి.. మాస్ మసాలా బీట్ ఒచ్చేసింది. తాజాగా విడుదల చేసిన నల్లంచు తెల్లచీర సాంగ్ ఇప్పటి నుంచి సోషల్ మీడియా ట్రెండింగ్ లిస్టులో తప్పకుండా ఉంటుంది.

  • Published Aug 12, 2024 | 9:06 PMUpdated Aug 12, 2024 | 9:06 PM
నల్లంచు తెల్లచీర సాంగ్ రిలీజ్.. నిజంగా రవితేజ- భాగ్యశ్రీ అరాచకమే..!

మిస్టర్ బచ్చన్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ- యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా ఇది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కర్నూలులో మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఇక్కడే మూవీ నుంచి ఫ్యాన్స్ కి ఒక కిరాక్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘నల్లంచు తెల్లచీర’ అనే సాంగ్ నంబర్ ని రీలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ సాంగ్ ని హరీశ్ శంకర్ ఎందుకు దాచాడో ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటి నుంచి మూవీ రిలీజ్ దాకా సోషల్ మీడియాలో ఇదే రిపీటెడ్ గా వినిపిస్తూ ఉంటుంది కాబట్టి.

నల్లంచు తెల్లచీర సాంగుకు సంబంధించి మొదట మిక్కీజే మేయర్స్ కొట్టిన ట్యూన్స్ ని మెచ్చుకోవాల్సిందే. ఇది పక్కా ఒక మాస్ మసాలా బీట్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంక ఆ తర్వాత భాస్కర భట్ల రవికుమార్ అందించిన లిరిక్స్ కి వందకు నూటయాభై మార్కులు వెయ్యాల్సిందే. సాంగ్ మధ్యలో “పరువాలకు ఫెన్సింగ్ ఉండొచ్చా? కరెంటు వైరు కురుల్తో అట్టా ఉరేసి చంపొచ్చా? సుకుమారం సోలో గుండొచ్చా? అంటూ ఆయన వేసిన ప్రశ్నలు ఆడియన్స్ మైండ్ లో నుంచి అస్సలు పోవు. ఇంక ఆ తర్వాత సింగర్స్ శ్రీరామచంద్ర, సమీర భరద్వాజ్ లను మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆ బీటు, ఆ లిరిక్స్ కి వందకు రెండు వందల శాతం న్యాయం చేశారు.

ఇంక వీళ్లందరి కంటే ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. వాళ్లు రవితేజ, హరీశ్ శంకర్, భాగ్యశ్రీ బోర్సే. ఈ సాంగ్ లో రవితేజ వేసే స్టెప్పులు, ఆ ఎనర్జీ చూస్తే ఆయన 55 దాటేశాడు అంటే ఎవ్వరూ నమ్మలేరు. ఇంకా 30 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులేస్తుంటే ఫ్యాన్స్ థియేటర్లు దద్దరిల్లేలా ఈలలు వేయడం ఖాయం. ఇంక భాగ్యశ్రీ అయితే రవితేజకు పోటీగా ఎనర్జీ చూపించడమే కాకుండా.. అదనంగా అందంతో ఆకట్టుకుంటోంది. తను ఈ పాటలో ఇచ్చిన క్యూటు క్యూటు ఎక్స్ ప్రెషన్స్ కు అభిమానులు గిల గిల కొట్టేసుకోవాల్సిందే. ఇంక ఈ పాట ఇంత బాగా రావడానికి వెనకుండి నడిపించిన హరీశ్ శంకర్ ను అయితే మీరు కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇప్పటి నుంచి మీకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ పాటే వినిపిస్తుంది, కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. నల్లంచు తెల్లచీర సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş