iDreamPost
android-app
ios-app

మిస్టర్ బచ్చన్ టీమ్ కీలక నిర్ణయం.. సినిమాని ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నారు

Mr Bachchan Movie Trimmed By 13 Minutes: మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించి వచ్చిన కన్ స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ని పరిగణలోకి తీసుకున్న మూవీ టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Mr Bachchan Movie Trimmed By 13 Minutes: మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించి వచ్చిన కన్ స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ని పరిగణలోకి తీసుకున్న మూవీ టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మిస్టర్ బచ్చన్ టీమ్ కీలక నిర్ణయం.. సినిమాని ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నారు

మాస్ మహారాజ రవితేజ- టాలెంటెండ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాపై మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. కొందరు నెగిటివ్ గా కూడా ట్రోల్స్ చేశారు. రవితేజ ఫ్యాన్స్ కూడా సినిమాపై పెదవి విరుస్తున్నారు. అయితే ట్రోల్స్, ఫీడ్ బ్యాక్స్, సలహాలు ఇలా వీటికి ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ టీమ్ వీటిపై రియాక్ట్ అయ్యింది. సినిమాకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. మరి.. ఈ నిర్ణయం సినిమాకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియాలి అంటే ఇంకో రోజు ఆగాల్సిందే.

మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ వరకు ఫుల్ బజ్ ఉంది. ఆగస్టు 15న రేసులో నాలుగు సినిమాలు ఉన్నా కూడా మిస్టర్ బచ్చన్ కే ప్రేక్షకులు ఎక్కువ మొగ్గు చూపారు. కానీ, స్పెషల్ షోస్ తర్వాతి నుంచే నెగిటివ్ రివ్యూస్, ట్రోల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆగస్టు 15న సినిమా విడుదల తర్వాత అవి ఇంకాస్త ఎక్కువ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ వరకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే సెంకడ్ ఆఫ్ మాత్రం వర్కౌట్ కాలేదు అంటూ అభిప్రాయాలు వినిపించాయి. ముఖ్యంగా రైడ్ కి సంబంధించి జగపతి బాబు- రవితేజ మధ్య జరిగే సంఘర్షణ అంతా మైండ్ గేమ్ అయినప్పటికీ తేలిపోయింది. అలాగే విలన్ పాత్ర కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. రివ్యూస్ సంగతి పక్కన పెడితే.. మిస్టర్ బచ్చన్ టీమ్ మాత్రం సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నారు.

అయితే ఇప్పుడు సినిమా విషయం కీలక నిర్ణయం తీసుకున్నారు. మిస్టర్ బచ్చన్ టీమ్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటంటే.. సినిమా ట్రిమ్ చేయాలి అని. అవును.. సినిమాని ఇంకో 13 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో “సినిమాకి సంబధించి వచ్చిన కన్ స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ని పరిగణలోకి తీసుకుని.. మూవీ ఎక్స్ పీరియన్స్ ని పెంచడానికి.. సినిమాని 13 నిమిషాలు ట్రిమ్ చేశాం” అంటూ చెప్పుకొచ్చారు. ఫస్ట్ పార్ట్ లో దాదాపుగా కులకర్ణి షార్ప్ ఎడిటింగ్ తోనే వెళ్లాడు. కాబట్టి ట్రిమ్ చేస్తే.. కచ్చితంగా సెకండ్ హాఫ్ లో జరిగి ఉండచ్చు. ఈ ట్రిమ్ చేసిన వర్షన్ ఎలా ఉంది అనేది తెలియాలి అంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. ఈ వార్త రవితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. మిస్టర్ బచ్చన్ సినిమాని 13 నిమిషాలు ట్రిమ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by People Media Factory (@peoplemediafactory)