iDreamPost
android-app
ios-app

మిస్టర్ బచ్చన్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఊరమాస్ బీట్!

  • Published Jul 25, 2024 | 5:30 PM Updated Updated Jul 25, 2024 | 5:30 PM

Mr Bachchan Second Single Reappal Dappul Review: హరీశ్ శంకర్- మాస్ మహరాజ రవితేజ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ సెకండ్ సింగిల్ వచ్చేసింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస అప్ డేట్స్ తో అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Mr Bachchan Second Single Reappal Dappul Review: హరీశ్ శంకర్- మాస్ మహరాజ రవితేజ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ సెకండ్ సింగిల్ వచ్చేసింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస అప్ డేట్స్ తో అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

  • Published Jul 25, 2024 | 5:30 PMUpdated Jul 25, 2024 | 5:30 PM
మిస్టర్ బచ్చన్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఊరమాస్ బీట్!

రవితేజ అంటే ఎనర్జీ అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జిటిక్, మోస్ట్ డేరింగ్ హీరో ఎవరు అంటే టక్కున మాస్ మహరాజ రవితేజ పేరు చెప్పేస్తారు. ఈయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ.. ఎనర్జీ డబుల్, త్రిబుల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అది ఫ్యాన్స్ చెప్పడం కాదు.. ఈ మిస్టర్ బచ్చన్ సెంకడ్ సింగిల్ రెప్పల్ డబ్బుల్ లిరికల్ సాంగ్ చూస్తే ఎవరైనా అదే మాట చెప్పేస్తారు. టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది యంగ్ హీరోలు కూడా ఈ సాంగ్ చూస్తే రవితేజ ఎనర్జీకి ఫిదా అయిపోవాల్సిందే. రెప్పల్ డబ్బుల్ అంటూ ఒక డిఫరెంట్ మాస్ బీట్ తో వచ్చిన మిస్టర్ బచ్చన్ ప్రేక్షకులను మెప్పించాడా? చూద్దాం.

హరీశ్ శంకర్- రవితేజ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్ డేట్ ఆ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్క డైలాగ్ లేకుండా షో రీల్ వచ్చింది. అది ఇండస్ట్రీలో తీసుకొచ్చిన రీ సౌండ్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత సితార్ సాంగ్ తీసుకొచ్చారు. ఈ సాంగ్ లో ఉన్న బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ మూవీ మీద అంచనాలను.. ఈ సాంగ్ మరో ఎత్తుకు తీసుకెళ్లినట్లు అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఈ సాంగ్ లో మొదట మ్యూజిక్.. ఆ మాస్ బీట్ గురించి మాట్లాడుకోవాలి. ఎలాంటి వాళ్లైనా ఈ ట్యూన్ వింటే వయసు మర్చిపోయి కాళ్లు కదపాల్సిందే. ఇంక ఆ తర్వాత కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక మాస్ బీట్ కి ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉండాలి? ఎంత కలర్ ఫుల్ గా ఉండాలి అనేది వీళ్ల సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. ఇంక మాస్ మహరాజ- భాగ్యశ్రీ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీట్ ఎంత మాసీగా ఉందో.. వాళ్ల స్టెప్పులు, కెమిస్ట్రీ అంతకు మించి మాసీగా ఉంది. ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతారు. వెండితెర మీద వీళ్లు వేసిన ఈ మాస్ బీట్ కి అభిమానులు పిచ్చెక్కిపోతారు. ఈ మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అందుకు శరవేగంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇలా అప్ డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ కూడా పెంచుతున్నారు. మరి.. ఈ మాస్ బీట్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet