Ravi Teja: మిస్టర్ బచ్చన్ ఫలితం.. రవితేజ కీలక నిర్ణయం! రెమ్యునరేషన్ వెనక్కి

Ravi Teja return Rs. 4 crores remuneration, Mr. Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం కారణంగా రవితేజ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ బాటలో నడిచి తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Ravi Teja return Rs. 4 crores remuneration, Mr. Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం కారణంగా రవితేజ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ బాటలో నడిచి తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. దాంతో నిర్మాత, బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఫలితంతో డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తన రెమ్యునరేషన్ లో రూ. 2 కోట్లు తగ్గించుకున్నాడు హరీష్. ఇప్పుడు ఇదే బాటలో హీరో రవితేజ కూడా నడిచినట్లు తెలుస్తోంది. తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు సమాచారం.

మిస్టర్ బచ్చన్ మూవీ నిరాశపరచడంతో.. నిర్మాత, బయ్యర్లకు భారీ నష్టాలు వాటిల్లాయి. ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తన పారితోషికంలో రెండు కోట్లు తగ్గించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే బాటలో హీరో రవితేజ కూడా నడిచినట్లు సమాచారం. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రవితేజ తనకు రావాల్సిన పారితోషికంలో రూ. 4 కోట్లు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలకు భారీ నష్టాలు రావడంతో మాస్ మహారాజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. దాంతో కొంతలో కొంత నష్టాలు తీర్చినట్లు అవుతుందని వారి ఆలోచన. కాగా.. హీరో, డైరెక్టర్ కలిసి రూ. 6 కోట్లు తగ్గించుకోవడంతో నైజాం బయ్యర్లకు వచ్చిన లాస్ దాదాపు భర్తీ కావొచ్చు.

కాగా.. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘రైడ్’ కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కింది. అయితే.. హిందీ సినిమాకు పూర్తి భిన్నంగా కమర్షియల్ హంగులతో హరీష్ శంకర్ దీన్ని తీర్చిదిద్దాడు. ప్రమోషన్స్ కూడా భాగా చేశారు. భాగ్యశ్రీ అందాలు సినిమాకు ప్లస్ పాయింట్ అయినప్పటికీ.. ప్రేక్షకులు ఎందుకో ఈ మూవీని రిసీవ్ చేసుకోలేదు. దాంతో మేకర్స్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక గతంలో కూడా ఓ సినిమాకు నష్టాలు రావడంతో రవితేజ తన రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చిన సందర్భం కూడా ఉంది. మరి తన పారితోషికాన్ని తగ్గించుకుని గొప్ప మనసును చాటుకున్న రవితేజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments