iDreamPost
android-app
ios-app

అప్పుడేమో రవితేజకు లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో

హరీష్ శంకర్-మాస్ మహారాజా రవితేజ మూవీలో నటించిన మిస్టర్ బచ్చన్.. ఆగస్టు 15న విడుదలైంది. అయితే ఇందులో జగపతి బాబు భార్యగా ఓ సీనియర్ నటీమణి యాక్ట్ చేసింది గుర్తుపట్టారా...? ఒకప్పుడు..

హరీష్ శంకర్-మాస్ మహారాజా రవితేజ మూవీలో నటించిన మిస్టర్ బచ్చన్.. ఆగస్టు 15న విడుదలైంది. అయితే ఇందులో జగపతి బాబు భార్యగా ఓ సీనియర్ నటీమణి యాక్ట్ చేసింది గుర్తుపట్టారా...? ఒకప్పుడు..

అప్పుడేమో రవితేజకు లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో

రవితేజ- హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. స్వాతంత్య్ర దినోత్సవాన్నిపురస్కరించుకుని ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాగా, ఈ మూవీకి డివైడ్ టాక్ రావడంతో 13 నిమిషాల పెట్టి ట్రిమ్ చేసింది చిత్ర యూనిట్. న్యూ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే అందచందాలు ఈ మూవీకి ప్లస్ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సత్య, చమక్ చంద్ర ఉన్నంత మేరకు తమ కామెడీతో మెప్పించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, టీ సిరిస్ ఫిల్మ్, పనోరమ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ట, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అభిషేక్ పాఠక్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు ఆంటోగనిస్ట్ రోల్ పోషించాడు. ఆయన భార్యగా నటించింది ఒకప్పటి హీరోయిన్. మణిచందన. ఇందులో మరో విశేషమేమిటంటే.. ఆమె గతంలో రవితేజతో హీరోయిన్‌గా నటించింది.

2000వ దశకంలో సపోర్టింగ్ రోల్ అండ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మణిచందన. తొలి ప్రేమ మూవీలో కీర్తి రెడ్డి స్నేహితురాలిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పిల్ల నచ్చింది మూవీలో బ్రహ్మానందం భార్యగా కాజోల్ పాత్రలో నవ్వించింది. భర్తను హింసించే భార్యగా నటించింది. ఆ తర్వాత పెళ్లాం వచ్చింది అనే మూవీలో నటించింది. కానీ ఆమె హీరోయిన్‌గా మారింది మనసిచ్చాను అనే మూవీతోనే. ఇందులో రవితేజ హీరో కావడం గమనార్హం. ఇందులోనే ఓ పాటలో గత ఏడాది అనారోగ్యంతో మరణించిన రాకేశ్ మాస్టర్ కనిపిస్తారు. ఆ తర్వాత టెన్షన్.. టెన్షన్, ఎన్టీఆర్ నగర్, దేవీ నాగమ్మ అనే చిత్రాలను చేసింది. మహేష్ బాబు నిజం మూవీలో రత్తాలుగా కనిపిస్తుంది. ఇందులో ‘రత్తాలు రత్తాలు నూజివీడు రసాలు.. ఇత్తావా ఇత్తావా‘ అంటూ మహేష్ బాబు వెంటపడేది ఈమె వెనకనే.

ఇవే కాకుండా తమిళంలో కన్నడలో రెండు చిత్రాలు, తమిళంలో ప్రభు సరసన వన్నా తమిళ్ల పట్టు అనే మూవీలో నటించింది. నిజం తర్వాత మణిచందన.. సినిమాలకు దూరంగా ఉంది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోయింది. ఈమెకు ఓ పాప. సుమారు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత ఉంగరాల రాంబాబు చిత్రంలో తిరిగి కనిపించింది. సీనియర్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోయింది. ఆచారీ అమెరికా యాత్ర, బుర్ర కథతో పాటు నరేష్ నాందీలో హీరోయిన్ తల్లిగా కనిపించింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీలో సీనియర్ నటుడు జగపతి బాబుకు భార్యగా..ఇంటికి పెద్ద కోడలిగా యాక్ట్ చేసింది. ఇందులో రవితేజ, మణిచందన మధ్య సన్నివేశాలు కూడా ఉన్నాయి. అప్పుడేమో రవితేజ లవర్‌గా కనిపించిన ఆమె.. ఇప్పుడు అమ్మ, అత్త వంటి ఏజ్డ్ పాత్రలను పోషిస్తుంది. ప్రస్తుతం దేవర,  బచ్చల మల్లి వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది ఈ సీనియర్ నటి.

 

View this post on Instagram

 

A post shared by ManichandhanaAyithi (@actress_manichandhanaayithi)