iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు యూత్ క్రష్.. త్వరలో కొత్త సినిమాతో వస్తుంది!

  • Published Jul 29, 2024 | 11:00 PM Updated Updated Jul 29, 2024 | 11:00 PM

ఈ ఫోటోలో తలపైకి ఎత్తి చప్పట్లు కొడుతూ ఫోజులిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఇప్పుడు టాలీవుడ్ ముంగిట్లో వెలిసిన కొత్త క్రష్. ఆమె నడుము ఒంపులకు కుర్రకారు ఫ్లాట్. ఇంతకు ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

ఈ ఫోటోలో తలపైకి ఎత్తి చప్పట్లు కొడుతూ ఫోజులిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఇప్పుడు టాలీవుడ్ ముంగిట్లో వెలిసిన కొత్త క్రష్. ఆమె నడుము ఒంపులకు కుర్రకారు ఫ్లాట్. ఇంతకు ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

  • Published Jul 29, 2024 | 11:00 PMUpdated Jul 29, 2024 | 11:00 PM
ఈ చిన్నారి ఇప్పుడు యూత్ క్రష్.. త్వరలో కొత్త సినిమాతో వస్తుంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలకు కొదవ లేదు. ఢిల్లీ డాల్స్ నుండి కేరళ కుట్టీల వరకు ఎంతో మంది అప్సరసలు తెలుగు ప్రేక్షకులను తమ బ్యూటీతో ఆకట్టుకున్నారు..ఆకట్టుకుంటున్నారు కూడా. ఎక్కడ అందం కనిపిస్తే పట్టుకొచ్చి టీటౌన్‌లో పరిచయం చేసేయాల్సిందే ఇక్కడ దర్శక నిర్మాతలు. అలాంటి గార్జియస్ భామలకు లైఫ్ ఇచ్చేస్తుంటారు తెలుగు ఆడియన్స్. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న అమ్మాయి తన లక్ ఎలా ఉందో తెలియాలంటే ఫస్ట్ మూవీ వరకు ఆగాల్సిందే. తను నటించిన సినిమా రిజల్ట్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉందా లేదా అని డిసైడ్ చేస్తుంది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె నటించిన తొలి సినిమా విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా ఎనౌన్స్ చేయగానే.. ఆమె ప్రొఫైల్ చెక్ చేయడంతో పాటు ప్రమోషన్లలో కూడా ఆకర్షణీయమైన వస్త్రధారణలతో ఆకట్టుకుంటున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో లెఫ్ట్ సైడ్ తల పైకి ఎత్తి చప్పట్లు కొడుతున్నచిన్నారి కూడా ఇప్పుడు నటిగా అవతారం ఎత్తింది. అంతే కాదు సినిమా రిలీజ్ కాకుండానే తెలుగు వారికి అప్పుడే ఆరాధ్య నటిగా మారింది. బాలీవుడ్ నుండి మెల్లిగా టాలీవుడ్ మూవీల్లోకి చొచ్చుకుని వచ్చిన ఈ సౌందర్య రాశి.. త్వరలోనే ఓ మూవీతో ఆకట్టుకోబోతుంది. ఫస్ట్ మూవీ విడుదల కాకుండానే సెకండ్ ఛాన్స్ కొట్టేసిందట. ఆమె అందానికి అవకాశాలు క్యూ కడతున్నాయి. ఇంతకు ఆమె ఎవరంటే.. తన సొగసుతో కుర్రకారుకు సెగలు రేపుతూ.. కొత్త క్రష్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పుట్టిన అమ్మడు స్కూలింగ్ సౌత్ ఆఫ్రికాలోని లాగోస్‌లో పూర్తి చే సింది. 12 తర్వాత ఇండియాకు వచ్చింది భాగ్యశ్రీ. ఇక్కడ ముంబయిలో బిజినెస్ మేనేజ్ మెంట్ చేసిన ఆమె.. తన 18 ఏళ్ల వయస్సులో మోడల్‌గా మారింది.

అలా మోడల్ నుండి యాక్టర్ అయ్యింది. ఆమె నటించిన తొలి సినిమా యారియాన్ 2 (మలయాళ మూవీ బెంగళూరు డేస్ రీమేక్)లో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత చందు చాంపియన్ చేసింది. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో మెరిసింది అమ్మడు. ఈ రెండు చిత్రాల్లో అంతగా గ్లామరస్ ఒలికించేందుకు అవకాశం దక్కలేదు. అక్కడ నుండి టీటౌన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. సితార్ సాంగ్ చూసి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయారు ఈ బొమ్మకు. ఆమె నడుము అందాలకు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అంతలో నిర్వహించిన టీజర్ విడుదలకు వేడుకకు డీప్ నెక్ జాకెట్, శారీలో వచ్చి మరింత మెస్మరైజ్ చేసింది. ఏముందిరా అమ్మాయి అంటూ కళ్లు విప్పారేలా ఆకర్షిస్తోంది. అయితే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయని టాక్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ మూవీలో కూడా ఫిక్స్ అయినట్లు వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా తెలుగు ఆడియన్స్.. ముఖ్యంగా యూత్ ఆమెకు లైఫ్ ఇచ్చిసినట్లే కనబడుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş