iDreamPost
android-app
ios-app

వీడియో: జాన్వీ కొట్టిన షాట్ కి ఆ హీరో పళ్లు రాలిపోయాయి..!

  • Published May 14, 2024 | 11:14 AM Updated Updated May 14, 2024 | 11:32 AM

Janhvi Kapoor: బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న అందాల భామ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

Janhvi Kapoor: బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న అందాల భామ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

  • Published May 14, 2024 | 11:14 AMUpdated May 14, 2024 | 11:32 AM
వీడియో: జాన్వీ కొట్టిన షాట్ కి ఆ హీరో పళ్లు రాలిపోయాయి..!

సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి అకాల మరణం అందరి హృదయాలు కలచిసింది. శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ ని మంచి హీరోయిన్ గా చూడాలని ఎంతో కోరికతో ఉండేది.. అందుకోకం అన్ని ప్రయత్నాలు కూడా చేసింది. దురదృష్ట వశాత్తు తన కూతురుని హీరోయిన్ గా చూడకుండానే కాలం చేసింది. జాన్వీ కపూర్ ‘ధడక్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి పేరు పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోతుంది. మొన్నటి వరకు బాలీవుడ్ లో మురిపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్, మాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా జాన్వీ కపూర్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

అందాల తార శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు అప్పుడప్పుడు ఐటమ్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను మత్తెక్కించింది. తన హాట్ హట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు కలల రాణిగా మారింది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తో మరో సినిమాలో జతకట్టబోతుంది. కాకపోతే ఈ విషయం ఎవరూ నిర్ధారించలేదు.. అలా అని ఖండించనూ లేదు. ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ తో ‘Mr And Mrs Mahi’ మూవీలో నటిస్తుంది జాన్వీ కపూర్. క్రికెట్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ బిజీగా సాగుతున్నాయి.

జాన్వీ కపూర్ హీరో రాజ్ కుమార్ తో క్రికెట్ ఆడుతు కనిపించింది. తను బ్యాటింగ్ చేస్తుంటే.. రాజ్ కుమార్ బాల్ వేశాడు. జాన్వీ కపూర్ కొట్టిన షాట్ కి రాజ్ కుమార్ పళ్లు విరిగిపోయినట్లు యక్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో చూస్తున్న నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. అయ్యో జాన్వీ కొట్టిన షాట్ కి పాపం హీరో పళ్లు రాలిపోయాయంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించి తల్లికి తగ్గ తనయ గా పేరు తెచ్చుకోవాలని ప్రేక్షకులు మనసారా కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş