iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో మరో విషాదం! జేడీ చక్రవర్తికి ఈయన చాలా స్పెషల్!

  • Published Aug 28, 2024 | 12:48 PM Updated Updated Aug 28, 2024 | 12:48 PM

Movie Writer Nadiminti Narsinga Rao: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Movie Writer Nadiminti Narsinga Rao: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published Aug 28, 2024 | 12:48 PMUpdated Aug 28, 2024 | 12:48 PM
ఇండస్ట్రీలో మరో విషాదం! జేడీ చక్రవర్తికి ఈయన చాలా స్పెషల్!

ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. పలు బాషలకు సంబంధించిన ఇండస్ట్రీలో సినీ దిగ్గజాలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. వయోభారం, హార్ట్ ఎటాక్, అనారోగ్యం ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. ఆ మద్య గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానిక్ నటులు కన్నుమూయగా, ప్రముఖ దర్శకులు హరికుమార్, సంగీత్ శిన్ మృతి చెందారు.ఈ మధ్యనే బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా వర్మ, మాలీవుడ్ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూశారు. నిన్న తమిళ నటుడు బ్రెజిల్ రమేష్, మాలీవుడ్ ప్రముఖ దర్శకులు ఎం మోహన్ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందే.. టాలీవుడ్ ప్రముఖ రచయిత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ‘గులాబీ’ మూవీ సెన్సేషన్ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో డైలాగ్స్, పాటలు, సంగీతం అన్నీ ప్రేక్షకులను అలరించాయి. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, ఊర్మిల నటించిన అనగనగా ఒక రోజు మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్ మంచి ఆదరణల లభించింది. ఇప్పటికీ ఆ డైలాగ్స్ కోసం సినిమాలు చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. బ్రహ్మానందం ‘నెల్లూరి పెద్దా రెడ్డి’ డైలాగ్ మీమ్స్ లో వాడుతుంటారు. తాజాగా గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాల డైలాగ్ రచయిత నడిమింటి నరసింగరావు (72) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

గత కొంతకాలంగా నరసింగరావు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల క్రితం ఆయన పరిస్థితి పూర్తిగా విషమించి కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలోనే ఈయన బుధవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింగరావుకి భార్య, కుమార్తె ఉన్నారు. పాతబస్తీ, ఊరికి మోనగాడు, కుచ్చి కుచ్చి కూనమ్మ వంటి మూవీస్ కి రచయితగా పనిశారు. సినిమాల్లోకి రాక ముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో దూరదర్శన్ లో టాప్ పొజీషన్ లో ఉన్న తెనాలి రామకృష్ణ సీరియల్ కి రచయితగా చేశారు. ఈ టీవీలో ప్రముఖ సీరియల్స్ వండర్ బాయ్, లేడీ డిటెక్టీవ్, అంతరంగాలు వంటి సీరియల్స్ కి మాటలు అందించారు. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.