iDreamPost
android-app
ios-app

అమెరికాలో తెలుగు సినిమా హవా! వీఎన్. ఆదిత్య ఆడిషన్ కి సూపర్ రెస్పాన్స్!

  • Published Jul 08, 2024 | 9:30 PM Updated Updated Jul 08, 2024 | 9:30 PM

VN Aditya: తన సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్నారు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. త్వరలోనే వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రూపుదిద్దుకోబోతోంది. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

VN Aditya: తన సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్నారు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. త్వరలోనే వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రూపుదిద్దుకోబోతోంది. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

  • Published Jul 08, 2024 | 9:30 PMUpdated Jul 08, 2024 | 9:30 PM
అమెరికాలో తెలుగు సినిమా హవా! వీఎన్. ఆదిత్య ఆడిషన్ కి సూపర్ రెస్పాన్స్!

టాలెంటెడ్ డైరెక్టర్లను సినీ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. వారు తీయబోయే సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు వీఎన్ ఆదిత్య. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి వారి హృదయాల్లో చెరగని ముద్ర చేశారు వీఎన్ ఆదిత్య. సినీ లవర్స్ కు పరిచయం అక్కర్లేని దర్శకుడు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే.. మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ, లేదంటే కమర్షియల్‌ హంగులతో ఉన్న సందేశాత్మక చిత్రం అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను డైరెక్ట్‌ చేస్తూ వచ్చిన వీఎన్‌ ఆదిత్య.. గత కొంత కాలంగా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కొన్ని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వీఎన్‌ ఆదిత్య సినిమాలకు సంబంధించి మరో న్యూ అప్‌డేట్‌ వచ్చేసింది. త్వరలోనే వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రూపుదిద్దుకోబోతోంది.

ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా.. వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో కొత్త సినిమా రాబోతున్నట్లు..చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు జూలై 7, ఆదివారం నాడు.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొత్త సినిమాపై ప్రకటన చేశారు. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త మూవీ నిర్మాణం డల్లాస్‌లో జరగనుందని.. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్తుందని మేకర్స్‌ వెల్లడించారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

ఈ ఆడిషన్స్ కు ప్రవాస భారతీయులు మాత్రమే కాక.. వరల్డ్ వైడ్ గా అనగా అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, ఇండియన్స్‌.. మరీ ముఖ్యంగా తమిళ్‌, కన్నడ, తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తూ.. ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. ఆడిషన్స్ కు ట్రెమండస్ స్పందన రావడంతో డైరెక్టర్ వీఎన్‌ ఆదిత్య హర్షం వ్యక్తం చేశారు. ఇక వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుందని తెలియడంతో ఆయన అభిమానులు మాత్రమే కాక మూవీ లవర్స్‌ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ మూవీస్‌కు కెరాఫ్‌ అడ్రెస్‌ అయిన వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో సినిమా అంటే.. కచ్చితంగా సున్నితమైన భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారని ప్రేక్షకులు నమ్ముతున్నారు. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కి ఇంతటి స్పందన రావడానికి కూడా ఇదే కారణం. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ వీ.ఎన్. ఆదిత్య ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకి వస్తారో చూడాలి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş