iDreamPost
android-app
ios-app

యాంకర్‌ సుమపై ఫైర్‌ అయిన సినిమా జర్నలిస్ట్‌!

కార్యక్రమం ప్రారంభం అవ్వటానికి ముందు నిర్మాత.. మీడియా ప్రతినిధులకు స్నాక్స్‌ అరెంజ్‌ చేశారు. వారు తింటూ ఉండగా..

కార్యక్రమం ప్రారంభం అవ్వటానికి ముందు నిర్మాత.. మీడియా ప్రతినిధులకు స్నాక్స్‌ అరెంజ్‌ చేశారు. వారు తింటూ ఉండగా..

యాంకర్‌ సుమపై ఫైర్‌ అయిన సినిమా జర్నలిస్ట్‌!

దాదాపు దశాబ్ధానికిపైగా టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా కొనసాగుతున్నారు సుమ. పెద్ద పెద్ద సినిమా ఈవెంట్ల దగ్గరినుంచి చిన్న చిన్న టీవీ షోల వరకు సుమ హవా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో జరుగుతున్న 90 శాతం ఈవెంట్లలో ఆమె దర్శనమిస్తున్నారు. ఈవెంట్‌ ఏదైనా తన నేర్పరి తనంతో ముందుకు నడిపించి, దిగ్విజయంగా పూర్తయ్యేలా చేస్తున్నారు. అలాంటి సుమపై ఓ సినిమా జర్నలిస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా జర్నలిస్ట్‌లపై ఆమె చేసిన కామెంట్లే ఇందుకు కారణం అయ్యాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. బుధవారం హైదరాబాద్‌లో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ‘ఆదికేశవ’ సినిమాలోని లీలమ్మ పాట విడుదల కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమం ప్రారంభం అవ్వటానికి ముందు నిర్మాత.. మీడియా ప్రతినిధులకు స్నాక్స్‌ అరెంజ్‌ చేశారు. వారు తింటూ ఉండగా.. స్టేజీపై ఉన్న సుమ.. ‘‘ ఎవరైతే బయట మేం పెట్టిన స్నాక్స్‌ని భోజనంలా తింటున్నారో వారు తొందరగా లోపలికి వచ్చి మీమీ కెమేరాలను ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం’’ అని అన్నారు.

కార్యక్రమం మొదలైన తర్వాత ఓ సినిమా జర్నలిస్ట్‌ ఆమె అన్న మాటలపై స్పందిస్తూ.. జర్నలిస్ట్‌లు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని ఆమె ఎగతాళి చేయటతాన్ని  ఆయన తప్పుబట్టారు. మీడియా ప్రతినిధులకు సుమ వేసే జోక్స్‌నుంచి మినహాయింపు ఇస్తే బాగుంటుందని అన్నారు. ఆమె అన్న మాటలు తమను చాలా బాధించాయని, ఇకపై అలాంటి మాటలు అనవద్దని వార్నింగ్‌ ఇచ్చారు. ఇక, తన మాటలు మీడియా ప్రతినిధులను బాధించాయని గుర్తించిన సుమ వారికి క్షమాపణ చెప్పింది. మరి,  యాంకర్‌ సుమపై సినిమా జర్నలిస్ట్‌ ఫైర్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş