iDreamPost
android-app
ios-app

చిరంజీవితో సందీప్ వంగా మూవీ.. హింట్ ఇచ్చేశాడుగా..!

  • Published Feb 03, 2024 | 3:49 PM Updated Updated Feb 03, 2024 | 5:55 PM

Chiranjeevi- Sandeep Vanga Movie: యానిమల్ సినిమాతో సందీప్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాంటి ఒక విధ్వంసకర చిత్రం మెగాస్టార్ తో చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Chiranjeevi- Sandeep Vanga Movie: యానిమల్ సినిమాతో సందీప్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాంటి ఒక విధ్వంసకర చిత్రం మెగాస్టార్ తో చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

  • Published Feb 03, 2024 | 3:49 PMUpdated Feb 03, 2024 | 5:55 PM
చిరంజీవితో సందీప్ వంగా మూవీ.. హింట్ ఇచ్చేశాడుగా..!

సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మారుమోగుతున్న పేరు. ఇక్కడి నుంచి వెళ్లి బొంబాయిని గడగడలాడిస్తున్నాడు. కంటెంట్ ఉంటే రూ.కోట్లు కురిపించడం పెద్ద విషయం ఏమీ కాదంటూ సందీప్ రెడ్డి వంగా మరోసారి నిరూపించాడు. యానిమల్ సినిమాతో బాలీవుడ్ ని భయపెట్టడమే కాకుండా.. వారి కుచింత మనస్తత్వాన్ని, కుళ్లు రాజకీయాలను వారి మీడియాలోనే బట్టబయలు చేశాడు. ఇతని టేకింగ్ మాత్రమే కాకుండా డేరింగ్ కి కూడా అక్కడి వాళ్లు వణికిపోతున్నారు. కుర్ర హీరోలతోనే ఈ స్థాయి హిట్లు కొడుతున్న సందీప్ రెడ్డి వంగా.. చిరంజీవిలాంటి మెగాస్టార్ తో మూవీ చేస్తే.. ఇంకేమైనా ఉంటుందా? అయితే ఆ కాంబో కూడా సిల్వర్ స్క్రీన్ మీద సెట్ అయ్యే దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు డైరెక్టర్ కూడా హింట్ ఇచ్చేశాడు.

సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి మూవీకి యువతలో ఎంతో క్రేజ్ ఉంది. డైరెక్టర్ గా పాన్ ఇండియా లెవల్లో తన స్టామినాని చూపించిన చిత్రం అది. అయితే యానిమల్ సినిమాతో తనలో ఉన్న డైరెక్టర్ ని పరిచయం చేశాడు. తన విజన్ ఏంటో వరల్డ్ వైడ్ గా బలంగా చెప్పాడు. యానిమల్ మూవీ సెన్సార్ ఏ సర్టివిఫికేషన్ తో కూడా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండితులను మాత్రమే కాకుండా.. సినీ ప్రముఖులను కూడా ఆశ్చర్యపరిచింది. కుర్ర హీరోలతోనే ఇలాంటి హిట్స్ ఇస్తున్న డైరెక్టర్.. చిరంజీవిలాంటి మెగాస్టార్ తో ఒక సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలు ఎక్కుతుందా? అనే అనుమానం అందరికీ ఉండచ్చు. కానీ, ఇప్పుడు నేరుగా డైరెక్టర్ హింట్ ఇవ్వడంతో ఆ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి.

తప్పకుండా సందీప్ రెడ్డి వంగా- చిరంజీవి కాంబోలో సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అసలు డైరెక్టర్ ఇచ్చిన ఆ హింట్ ఏంటంటే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా వెళ్లి చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సందర్భంగా చిరంజీవితో ఉన్న పిక్ నెట్టింట వైరల్ అయ్యింది. ఓ అభిమాని ఆ ఫొటోని గన్స్ బ్యాగ్రౌండ్ తో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “దేవుడా ఇది జరిగేలా చూడండి.. సందీప్ అన్న ఈ కాంబినేషన్ సెట్ చెయ్యి” అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్టుకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లైక్ కొట్టాడు. ఇంకేముంది హైరెక్టర్ హింట్ ఇచ్చేశాడు అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సందీప్ రెడ్డి కూడా గతంలో చిరంజీవితో సినిమా చేయాలి అని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు. అలాగే సందీప్ కి మెగాస్టార్ అంటే ఇష్టం అని అందరికీ తెలిసిందే. కాబట్టి ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో.. సందీప్ రెడ్డి వంగా కూడా మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాడు అనే విషయంపై క్లారిటీ అయితే వచ్చింది. ఇంకేముంది.. సందీప్- చిరు ఎలాంటి కథతో వస్తారు? ఎప్పుడు వస్తారు? అంటూ ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలు పెట్టారు. మరి.. సందీప్- చిరు కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet