Arjun Suravaram
MAA lift Ban On Actress Hema: గతంలో సినీ నటి హేమపై మూవీ ఆర్టిస్ట్స అసోషియేషన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసింది. రేవ్ పార్టీ ఇష్యూ నేపథ్యంలో మా ఈ చర్యలు తీసుకుంది. తాజాగా ఆమె విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
MAA lift Ban On Actress Hema: గతంలో సినీ నటి హేమపై మూవీ ఆర్టిస్ట్స అసోషియేషన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసింది. రేవ్ పార్టీ ఇష్యూ నేపథ్యంలో మా ఈ చర్యలు తీసుకుంది. తాజాగా ఆమె విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Arjun Suravaram
సినీ నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాలాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతేకాక తరచూ ఏదో ఒక విషయంతో ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమను అక్కడి పోలీసులు అరెస్టుచ సిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే హేమను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆమె విషయంలో మా కీలక నిర్ణయం తీసుకుంది.
హేమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్ణయం తీసుకుంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మా తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఇదే సమయంలో ఆమెకు మా అసోసియేషన్ ఓ షరతు విధించింది. మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ అసోసియోషన్ సూచించింది.
కొన్ని నెలల క్రితం బెంగళూరు జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు వినిపించింది. అంతేకాక ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఇలా రేవ్ పార్టీ ఇష్యూ జరిగిన నేపథ్యంలో నటి హేమపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివాదంలోచిక్కుకున్న హేమపై నైతికంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆ చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు రద్దు చేశారు. ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చిన హేమ.. మీడియాలో వస్తున్న నిరాధారమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, తనను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదన్నారు.
తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెప్పుకొచ్చారు. అంతేకాక తాను అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ లో పరీక్షలు చేయించుకున్నట్లు ఆమె నివేదికలు సమర్పించారు. తనపై అసత్య ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ‘మా’ ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం వల్ల తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రస్తావిస్తూ.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాశారు. ఆ లెటర్ తో పాటు మెడికల్ సర్టిఫికెట్‌లను మా అధ్యక్షుడికి పంపారు. హేమ పంపిన ఆధారాలను పరిశీలించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి, ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి.. హేమపై మా తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.