Krishna Kowshik
1980 నుండి 90 వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన సౌత్ ఇండియన్ స్టార్ అయ్యాడు. అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎంతటి స్టార్ డమ్ చూశాడో.. ఒక్క మూవీతో వెనుదిరిగాడు. దానికి కారణం ఎయిడ్స్ అంటూ వార్తలు వినిపించాయి.
1980 నుండి 90 వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన సౌత్ ఇండియన్ స్టార్ అయ్యాడు. అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎంతటి స్టార్ డమ్ చూశాడో.. ఒక్క మూవీతో వెనుదిరిగాడు. దానికి కారణం ఎయిడ్స్ అంటూ వార్తలు వినిపించాయి.
Krishna Kowshik
80స్ అమ్మాయిల కలల రాకుమారుడు అతడు. చెప్పాలంటే అప్పట్లో సౌత్ ఇండియన్ స్టార్. ఆ హీరో నవ్వితే చాలు ఎంతో మంది అమ్మాయిలు ఫ్లాట్. వరుస పెట్టి హిట్స్ అందుకున్నాడు. సుమారు దశాబ్దన్నర కాలం పాటు కోలీవుడ్ ఇండస్ట్రీని శాసించాడు. తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేశాడు. కానీ ఉన్న పళంగా మాయం అయిపోయాడు ఈ గ్రీక వీరుడు. మళ్లీ వచ్చి సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేశాడు. మళ్లీ గ్యాప్ తీసుకుని ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నాడు. అయితే అతడు సినిమాల నుండి తప్పుకోవడానికి కారణం ఓ వ్యాధి అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించాడు ఒకప్పటి స్టార్ హీరో.
మణిరత్నం తెరకెక్కించిన అందమైన ఫ్యామిలీ డ్రామా మౌనరాగం. అందులో హీరో గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. అతడే మోహన్. కోకిల మోహన్, మైక్ మోహన్ అన్న బిరుదులు ఆయన సొంతం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యాడు ఈ యాక్టర్. కోకిల అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్.. అనతి కాలంలోనే స్టార్ హీరో అయిపోయాడు. తెలుగులో తూర్పు వెళ్లే రైలు, స్రవంతి, ఆలపాన, ఆత్మకథ, చూపులు కలిసిన శుభవేళ, పోలీస్ రిపోర్ట్, శారదాంబ వంటి సినిమాలు చేశాడు. అతడికి నేమ్ ఫేమ్ తెచ్చినది మాత్రం తమిళ ఇండస్ట్రీనే. ఒకానొక దశలో కమల్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా నిలిచాడు. బాలు మహేంద్రన్, మణిరత్నం వంటి దర్శకులతో మోహన్ వర్క్ చేశాడు.
అయితే 1999లో ఆయన డైరెక్ట్ చేసిన ఓ మూవీ ప్లాప్ ఇవ్వడంతో.. యాక్టింగ్ ఆపేసి.. వెండితెరపై సీరియల్స్ చేయడం స్టార్ చేశాడు. మళ్లీ గ్యాప్ తీసుకుని 2008లో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2016లో ఓ తెలుగు సినిమా చేసి తెరమరుగయ్యాడు. మళ్లీ 14 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే హీరోగా హర మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ పంచుకున్నాడు. తాను సినిమాల్లో నటించకపోవడానికి కారణం.. తనకు ఎయిడ్స్ ఉందని, అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాడని, ఆ వ్యాధితో బాధపడుతూ చనిపోయినట్లు వార్తలు వచ్చాయని అన్నారు. ఈ న్యూస్ చూసి చాలా మంది అభిమానులు నమ్మి.. తన ఇంటికి వచ్చినట్లు కూడా చెప్పారు. ఆ సమయంలో తానే కాదు.. తన కుటుంబ సభ్యులు కూడా షాక్ తిన్నామని చెప్పుకొచ్చారు. ఇది కేవలం అబద్ధమని తనకు, తన కుటుంబ సభ్యులకు తెలుసునని, అందుకే తాను పట్టించుకోలేదని అన్నారు. కాగా, హర మూవీతో పాటు వెంకట్ ప్రభు.. విజయ్ కాంబోలో వస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీలో కనిపించబోతున్నాడు ఈ హీరో.