iDreamPost
android-app
ios-app

Vamsi Krishna Reddy: నా భార్య అంటే నాకు చాలా ప్రేమ.. కానీ విడాకులు: వంశీకృష్ణారెడ్డి

  • Published Jan 20, 2024 | 3:05 PM Updated Updated Jan 20, 2024 | 3:05 PM

Vamsi Krishna Reddy About Netra Reddy: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన మాజీ భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

Vamsi Krishna Reddy About Netra Reddy: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన మాజీ భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

  • Published Jan 20, 2024 | 3:05 PMUpdated Jan 20, 2024 | 3:05 PM
Vamsi Krishna Reddy: నా భార్య అంటే నాకు చాలా ప్రేమ.. కానీ విడాకులు: వంశీకృష్ణారెడ్డి

మోటివేషనల్‌ స్పీకర్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీకృష్ణారెడ్డి. మోటివేషనల్‌ వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేస్తూ ఎంతో ఫేమస్‌ అయ్యాడు. అలానే నేత్రా సేంద్రీయ వ్యవసాయం చేసి విజయం సాధించడమే కాక.. అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీని కన్నా ముందు నేత్రా రెడ్డి సినిమాల్లో కూడా నటించింది. సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ-నేత్రా ఇద్దరు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు వీరి పెళ్లిని అంగీకరించలేదు. దాంతో వీరిద్దరే వేరుగా కలిసి ఉండేవారు. వారధి ఫామ్స్‌ అనే కంపెనీ ప్రారంభించి.. దీని ద్వారా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు అప్లోడ్‌ చేస్తూ.. ఎంతో ఫేమస్‌ అయ్యారు.

రెండేళ్ల వివాహం బంధం ఎంతో సజావుగా సాగింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వీరి అభిమానులు, నెటిజనులు బాధపడ్డారు. ఈ క్రమంలో తాజాగా వంశీకృష్ణారెడ్డి ఐడ్రీమ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ముందు నుంచి తన జీవితం, నేత్రాతో పరిచయం, ప్రేమ, పెళ్లి, ప్రొఫేషనల్‌ లైఫ్‌ అన్నింటి గురించి చెప్పుకొచ్చాడు. కలిసి ఉన్న సమయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని.. ఒకరికి ఒకరం అన్నట్లుగా ఉండే వాళ్లమని చెప్పుకొచ్చాడు.

తమ ఇద్దరి దారులు వేరు కావడం వల్లనే విడిపోయామని చెప్పాడు వంశీకృష్ణారెడ్డి. అంతేకాక ఈ ఏడాదిన్నర కాలంలో తాము ప్రేమికుల్లానే ఉండేవాళ్లమని.. తాళి ఉండటం ఒక్కటే తేడా అని చెప్పుకొచ్చాడు. బయటకు కూడా పెద్దగా వెళ్లకపోయేవాళ్లం అన్నాడు. వీడియోల్లో చూసి..నేత్రా చాలా స్టబర్న్‌ అనుకుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే తనది చాలా ఫ్రెండ్లీ నేచర్‌. ఎంతో జోవియల్‌గా ఉంటుంది. చాలా లవబుల్‌ పర్సన్‌  అని నేత్రా రెడ్డి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. అంతేకాక తామిద్దరం కలిసి ఉన్న రోజుల్లో జీవితం, కెరీర్‌ గురించి ఎన్నో మాట్లాడుకునేవాళ్లం అన్నాడు. కానీ వారిద్దరి దారులు వేరు కావడం వల్లనే విడిపోవాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు వంశీకృష్ణారెడ్డి.

అయితే తమ విడాకులకు గల కారణాలను మాత్రం చెప్పకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు వంశీకృష్ణారెడ్డి. ఈ పరిస్థితి ఇద్దరికి కష్టమే కానీ.. దీని నుంచి త్వరలోనే బయటపడతాము అన్నాడు. అంతేకాక విడిపోయాక నేత్రా రెడ్డి వారధి ఫామ్‌ను చూసుకుంటుందని.. తన పరిస్థితి ఇప్పుడు మళ్లీ జీరోకి పడిపోయిందని.. తిరిగి కొత్తగా స్టార్ట్‌ చేయాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.