iDreamPost
android-app
ios-app

పెళ్లిపై ఆసక్తి లేదు.. సహజీవనం చేస్తా: హీరోయిన్ కామెంట్స్ వైరల్!

  • Published Dec 29, 2023 | 5:44 PM Updated Updated Dec 29, 2023 | 5:44 PM

Monisha Mohan Menon:సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతో మంది నటీ నటుల వెనుక ఎవరికీ తెలియని కథనాలు ఉంటాయి. అటువంటి వారిలో ఒకరు మోనిష మోహన్ మీనన్. ఇప్పుడు ఆమె తాజాగా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Monisha Mohan Menon:సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతో మంది నటీ నటుల వెనుక ఎవరికీ తెలియని కథనాలు ఉంటాయి. అటువంటి వారిలో ఒకరు మోనిష మోహన్ మీనన్. ఇప్పుడు ఆమె తాజాగా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

  • Published Dec 29, 2023 | 5:44 PMUpdated Dec 29, 2023 | 5:44 PM
పెళ్లిపై ఆసక్తి లేదు.. సహజీవనం చేస్తా: హీరోయిన్ కామెంట్స్ వైరల్!

చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ వాళ్ళ ప్రతిభను కనబరుస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా వారి నటనతో అందరిని ఆకట్టుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. అయితే, మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ భామ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నటి.. అంతేకాకుండా ఈమె ఒక ఫిల్మ్ మేకర్ కూడా. ఆమె పేరు మోనిషా మోహన్ మీనన్. ఈ ఏడాది విడుదలైన ఫైట్ క్లబ్ మూవీలో హీరోయిన్ గా నటించింది మోనిషా. అలాగే ఈ భామకు దర్శకత్వం మీద ఉన్న ఆసక్తితో.. న్యూ నార్మల్ అనే షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ లభించింది. ఇప్పటికే మోనిషాకు సోషల్ మీడియాలో కొన్ని వేలకు మంది ఫాల్లోవర్స్ ఉన్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ నటి తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.

మొదట మోనిషా తన కెరీర్ ను మోడలింగ్ తో మొదలు పెట్టింది. కానీ, ఆమెకు డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టమట. దానితో ఇంట్లో వారిని ఎదురించి మరీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఓ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోనిషా  మాట్లాడుతూ. “అంజలి మీనన్, జోయా అక్తర్ లాంటి దర్శకుల సినిమాలను చూసిన తర్వాత, నాకు డైరెక్టర్ అవ్వాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్తే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇన్ఫోటెక్ లో కొంతకాలం పని చేశాను. ఇంట్లో సినిమాల కోసం ఒప్పుకోలేదని, 2016 లో ఇల్లు వదిలి వచ్చేశాను.

i dont want to get married i will live together

ఆ తర్వాత దర్శకుడు రోషన్ ‘కాయంకులం కొచ్చుని’ సినిమా కోసం రీసెర్చ్ టీమ్ కావాలని పేపర్ లో యాడ్ ఇచ్చారు. వీటి గురించి నాకు అంతగా తెలియదు. కానీ, ఎలాగైనా సినిమాలలోకి రావాలి అనుకున్నాను. దీనితో ముప్పుతిప్పలు పడి ఆయన దగ్గర రీసెర్చ్ టీమ్ లో చేరి పని నేర్చుకున్నాను. తరువాత ఆయన తీసిన నాలుగు చిత్రాలకు తన దగ్గరే అసిస్టెంట్ గా పని చేశాను. అలా చేస్తున్న క్రమంలో న్యూ నార్మల్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. ఈ షార్ట్ ఫిల్మ్ కు మంచి ఆదరణ లభించింది. దానితో నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఇక పెళ్లి విషయానికొస్తే.. నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. పెళ్ళికి బదులుగా సహజీవనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రెండు నెలలు కాగానే బ్రేకప్ చెప్పుకుని మరొకరిని ప్రేమిస్తున్నారు. ఈ మాత్రం దానికి పెళ్లేందుకు?” అంటూ తన గురించి చెప్పుకొచ్చింది మోనిషా.

i dont want to get married i will live together

ఇక దర్శకురాలిగా అవుదాం అని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోనిషా..  హీరోయిన్ గా కూడా మంచి మార్కులు కొట్టేసింది. మంచి దర్శకులు అవ్వాలంటే ముందుగా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయాలి. ఆ తర్వాత మెల్ల మెల్లగా వాటిపై జ్ఞానాన్ని మెరుగుపరచుకోవాలని మోనిషా చెప్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన పోస్ట్స్ పెడుతూ యాక్టీవ్ గా ఉంటుంది ఈ అమ్మడు. మరి, మోనిషా మీనన్ షేర్ చేసుకున్న తన వ్యక్తిగత విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.