iDreamPost
android-app
ios-app

మాలీవుడ్ గేమ్ ఛేంజర్ మంజుమ్మెల్ బాయ్స్.. మరో రికార్డు!

  • Published Mar 09, 2024 | 8:53 PM Updated Updated Mar 09, 2024 | 8:53 PM

Manjummel Boys New Record: మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Manjummel Boys New Record: మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

  • Published Mar 09, 2024 | 8:53 PMUpdated Mar 09, 2024 | 8:53 PM
మాలీవుడ్ గేమ్ ఛేంజర్ మంజుమ్మెల్ బాయ్స్.. మరో రికార్డు!

ఈ ఏడాది మలయాళం సినిమాకి గోల్డెన్ ఇయర్ గా మారింది. జనవరిలో మంచి హైప్ తో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన మలైకొట్టై వాలిబన్ భారీ ఫ్లాప్ అయినా… ఫిబ్రవరిలో ఏకంగా మూడు సూపర్ హిట్స్ అందించింది. ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ ఈ మూడు సినిమాలు ఒకే నెలలో విడుదలై బాక్సాఫీస్ ను అల్లాడించాయి. ముఖ్యంగా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా అన్ని భాషల ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. షోబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసిల్, బాలు వర్ఘీస్ తదితరులు నటించిన ఈ చిత్రం మళయాళ బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో పాటు తాజాగా మాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మలయాళ సినిమాల్లో ఆల్ టైం టాప్- 3 పొజిషన్ ను దక్కించుకుంది. మరోవైపు యూఎస్ మార్కెట్ లో హిస్టరీ క్రియేట్ చేసింది. న్యూ ఏజ్ సినిమాలకు మలయాళ ఇండస్ట్రీ బాగా పేరు తెచ్చుకున్నప్పటికీ యూఎస్ లో మాత్రం ఎందుకో అంతగా ప్రభావం చూపలేకపోయింది. గల్ఫ్ దేశాల్లో మాలీవుడ్ మార్కెట్ బాగా ఉన్నా యూఎస్ లో మాత్రం ఇంకా అంతగా కుదురుకోలేదు. కానీ మొట్ట మొదటిసారిగా యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ అందుకున్న మలయాళ చిత్రంగా “మంజుమ్మల్ బాయ్స్” రికార్డు సృష్టించింది. దీనితో ఇన్నేళ్ల హిస్టరీలో మలయాళ సినిమా మొదటిసారి 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగుపెట్టింది.

ఇక ఈ సినిమాకి పాన్ ఇండియా లెవల్లో స్ట్రాంగ్ బజ్ వచ్చేసింది. ఇప్పటికే తమిళనాడులో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారట. కాగా తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని మార్చి 15న తెలుగులో విడుదల చేస్తారట. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుందని టాక్. మరి యూఎస్ లాగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిద్దాం.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet