iDreamPost
android-app
ios-app

AMMA ప్రెసిడెంట్ గా మోహన్ లాల్ రాజీనామా.. కోలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది?

  • Published Aug 27, 2024 | 4:02 PM Updated Updated Aug 28, 2024 | 8:19 AM

Mohanlal: గత కొన్నిరోజులుగా మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది.ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరో మోహన్ లాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Mohanlal: గత కొన్నిరోజులుగా మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది.ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరో మోహన్ లాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

AMMA ప్రెసిడెంట్ గా మోహన్ లాల్ రాజీనామా.. కోలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది?

మాలీవుడ్ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదక పెను సంచలనాలకు దాని తీస్తుంది. ఈ క్రమంలోనే మలయాళ సినీ కళాకారుల సంఘం (AMMA) అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేశారు. నిన్నటి వరకు ఆయనపై కూడా పలువురు విమర్శలు చేశారు. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా.. నోరు మెదపకుండా ఉన్నారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. దీంతో ఆయన మంగళవారం మధ్యాహ్నం తన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను అసోసియేషన్ అధ్యక్షుడిగా 17 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక కమిటీని కలిగి ఉన్నాడు. మోమన్ లాల్ తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా ఉమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మలయాళ సినీ కళాకారుల సంఘం (AMMA) ప్రెసిడెంట్ పదవికి మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల AMMA కమిటీ సభ్యులపై కొందరు నటీనటులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకుంటున్నాను. మరో రెండు నెలల్లో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త పాలకవర్గాన్ని ఎంపిక చేస్తామని సంఘం తెలియజేసింది. అసోసియేషన్‌ను పునరుద్ధరించి బలోపేతం చేసే సామర్థ్యం ఉన్న నాయకత్వం త్వరలో బాధ్యతలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. మా లోపాలను ఎత్తి చూపినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు.

Mohanlal

అసలు మాలీవుడ్ ఇండస్ట్రీ‌లో ఏం జరుగుతుందీ అన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. 2017 లో మాలీవుడ్ నటి భావనపై కొందరు దుండగులు కారులో లైంగిక దాడికి పాల్పపడిన విషయం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఘటనకు కారకుడు మలయాళ అగ్రహీరో దిలీప్‌ కీలక నిందితుడిగా తేలింది. మాలీవుడ్ లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో నివేదిక ఇవ్వాలని 2019 లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ కే హేమ(రిటైర్డ్) నేతృత్వం వహించగా, మాజీ బ్యూరోక్రాట్ కెబి వల్సలకుమారి, నటి శారత ఇద్దరు సభ్యులుగా ఉన్నారు.మాలీవుడ్ లో మహిళలు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ పేర్కొంది.

ఈ క్రమంలోనే మాలీవుడ్ నటి రేవతి సంపత్ సీనియర్ నటుడు సిద్దీకిపై సంచలన ఆరోపణలు చేసింది. 2016 లో తిరువనంతపురంలో నీలా థియేటర్లలో ‘సుఖమరియతే’ మూవీ ప్రివ్యూ తర్వాత ఒంటరిగా ఉన్న తనపై లైంగిక దాడి చేసి హింసించాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. దీంతో ఆయన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కి రాజీనామా చేశారు. ఇన్నాళ్ళు జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా లేఖను AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్ కి అందజేశారు. ఇకప్పుడు మోహన్ లాల్ AMMA ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. కాగా, సిద్దికి మాలీవుడ్, కోలీవుడ్, తెలుగు ఇండస్ట్రీలో 350 పైగా సినిమాల్లో నటించాడు.