Dharani
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించి భారీ బడ్జెట్, హిస్టారికల్ మూవీ ఒకటి తెలుగులో.. అందులోనూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల కాబోతుంది. ఆ వివరాలు..
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించి భారీ బడ్జెట్, హిస్టారికల్ మూవీ ఒకటి తెలుగులో.. అందులోనూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల కాబోతుంది. ఆ వివరాలు..
Dharani
ఈ మధ్యకాలంలో ఓటీటీలకు క్రేజ్ బాగా పెరుగుతోంది. అన్నీ భాషల చిత్రాలు చూసే అవకాశం లభిస్తుండటంతో.. ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే విడుదల అయ్యి దుమ్ము లేపుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రతి వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఒకటి ఓటీటీలో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
మోహన్‌లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్ర మలైకొటై వాలిబాన్.. త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. అయితే థియేటర్లలోకి కాకుండా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు జల్లికట్టు ఫేమ్ లిజో సోజ్ పెల్లిసరీ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్, లిజో జోస్ కాంబో కావడంతో మూవీ షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ రిజల్ట్ మాత్రం ఆశించనట్లుగా రాలేదు. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ముందైతే ఈ సినిమాను మలయాళంతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ మలయాళ రిజల్ట్ చూశాక ఆ ప్రయత్నాన్ని విమరించుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా మలైకొటై వాలిబాన్ తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మలైకొటై వాలిబాన్‌లో మోహన్‌లాల్ డబుల్ యాక్షన్ చేశాడు. మలైకోటై వాలిబాన్, మలైవేటై వాలిబాన్ అనే పాత్రల్లో అతడి యాక్టింగ్, చూపించిన వేరియేషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే పేరొచ్చినప్పటికి.. దర్శకుడు కథను కన్ఫ్యూజన్‌గా చెప్పడంతో సినిమా ఫెయిలైంది. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవలం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసి భారీ డిజాస్టర్‌గా మిగిలింది. మోహన్ లాల్ కెరీర్‌తో పాటు రీసెంట్ టైమ్‌లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది మలైకోటై వాలిబాన్ సినిమా.
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబన్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి.. వాటిని దాటుకుని ఆ ప్రాంత ప్రజలకు అతడు ఎలా నాయకుడు అయ్యాడన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో మరాఠీ నటి సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటించింది.