iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా వస్తున్న మోహన్ లాల్ – సిద్దార్థ్

  • Published May 19, 2022 | 6:34 PM Updated Updated May 19, 2022 | 6:34 PM
  • Published May 19, 2022 | 6:34 PMUpdated May 19, 2022 | 6:34 PM
సైలెంట్ గా వస్తున్న మోహన్ లాల్ – సిద్దార్థ్

రేపు థియేటర్లలో, ఓటిటిలో కొత్త సినిమాల సందడి మాములుగా లేదు. ఒకపక్క మూవీస్ మరోపక్క వెబ్ సిరీస్ లతో ఫుల్ గా కాలక్షేపం దక్కనుంది. మన టాలీవుడ్ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనానలతో ఎంజాయ్ చేయనుండగా బాలీవుడ్ ఆడియన్స్ కోసం షాహిద్ కపూర్ జెర్సీ రెడీ అవుతోంది. అయితే గుట్టుచప్పుడు చేయకుండా మరో క్రేజీ చిత్రం ఉందన్న సంగతి అధిక శాతం మూవీ లవర్స్ గుర్తించడం లేదు. అదే మోహన్ లాల్ 12త్ మ్యాన్(12th Man). జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని ఇవాళ అర్ధరాత్రి నుంచే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు ఆడియో ఉంటుందనుకున్నారు కానీ లేదనే క్లారిటీ వచ్చింది.

దృశ్యం, దృశ్యం 2 రూపొందిన జీతూ జోసెఫ్ ఇంత సైలెంట్ గా రావడం విచిత్రమే. కానీ దానికో కారణం ఉందంటున్నాయి సినీ వర్గాలు. ఈ మూవీ బాగా వచ్చిందట. రీమేక్ రైట్స్ కోసం డిమాండ్ ఏర్పడే అవకాశం ఉండటంతో డబ్బింగ్ లేకుండా కేవలం ఒరిజినల్ వెర్షన్ ని మాత్రమే విడుదల చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి స్పందనే వచ్చింది. సరదాగా సమయం గడుపుతున్న యువతీ యువకుల గుంపులోకి ఓ ఆగంతకుడు వెళ్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందినట్టు కనిపించింది కానీ ఊహించని ట్విస్టులతో కథ వేరేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. రీమేక్ అయ్యేదాకా వేచి చూడలేమంటే సబ్ టైటిల్స్ తో చూడటం మినహా మనకు వేరే ఆప్షన్ లేదు.

ఇది కాకుండా బొమ్మరిల్లు సిద్ధార్థ్ నటించిన ఎస్కేప్ లైవ్ కూడా హాట్ స్టార్ లోనే రాబోతోంది. ఇది కూడా థ్రిల్లర్ జానరే. ప్రమోషన్ పెద్దగా చేయలేదు కానీ ఫ్యాన్స్ కు దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. మరాఠి సూపర్ హిట్ జాంబీవిలీ(Zombivli ), ఆహా వెబ్ సిరీస్ బిఎఫ్ఎఫ్(AHA BFF), కన్నడ చిత్రం హానీమూన్, ది పేల్ హార్స్ సోని లివ్ లో వస్తున్నాయి. మరికొన్ని హిట్ సిరీస్ల కొత్త సీజన్లకు రేపే డేట్ ఫిక్స్ చేశారు. ఆహాలో హాలీవుడ్ డబ్బింగులు మెన్ ఇన్ బ్లాక్ 3, రెసిడెంట్ ఈవిల్, డీజంగో అన్ చైన్డ్, అడ్వెంచర్స్ అఫ్ టిన్ టిన్ రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి మే 20న ఇంటి నుంచి బయటికి కాలు పెట్టకుండా ఎంజాయ్ చేయడానికి నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ రాబోతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş