iDreamPost
android-app
ios-app

భక్త కన్నప్ప నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన మోహన్‌ బాబు!

భక్త కన్నప్ప భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సినిమాకు మంచు విష్ణు నిర్మాణ బాధ్యతల్ని చేపడుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్‌ అవ్వనుంది.

భక్త కన్నప్ప భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సినిమాకు మంచు విష్ణు నిర్మాణ బాధ్యతల్ని చేపడుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్‌ అవ్వనుంది.

భక్త కన్నప్ప నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన మోహన్‌ బాబు!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘‘ భక్త కన్నప్ప’’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్యాన్‌ ఇండియా మూవీగా భక్త కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మల్లయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక, ఈ చిత్ర షూటింగ్‌ ఎక్కువ భాగం  న్యూజిలాండ్‌లో జరిగింది. ఇందుకోసం కీలక పాత్రధారులతో పాటు దాదాపు 600 మంది దాకా సిబ్బంది న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడి అడవుల్లో.. అందమైన ప్రదేశాల్లో చిత్ర షూటింగ్‌ చేశారు.

తాజాగా, చిత్ర మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా మోహన్‌ బాబు బయటకు వెల్లడించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. హాలీవుడ్, భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో పాటు 600 దాకా సిబ్బందితో న్యూజిలాండ్‌ భక్త కన్నప్ప షూటింగ్‌ జరిగిందని తెలిపారు. థాయిలాండ్.. న్యూజిలాండ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు సినిమా కోసం పని చేశారని వెల్లడించారు. విష్ణు మంచు కథానాయకుడిగా నటించటంతో పాటు సినిమాను నిర్మించాడని తెలిపారు.

మొదటి షెడ్యూల్‌ కోసం 90 రోజులు వెచ్చించినట్లు తెలిపారు. న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందని తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నామని వెల్లడించారు. సినిమా సెట్‌లో కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. కాగా, భక్త కన్నప్ప సినిమాలో మంచు విష్ణు భక్త కన్నప్పగా కనిపించనున్నారు. ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శివుడిగా దర్శనం  ఇవ్వనున్నారు.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహా భారతం సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ మూవీకి దర్శకత్వం వహింస్తున్నారు. పరుచూరి గోపాలక్రిష్ణ, నాగేశ్వర రెడ్డిలు కథను అందించారు. స్టీఫెన్‌ దేవాసీ, మణిశర్మలు సంగీతం అందిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో సినిమా తెరకెక్కుతోంది. 2024 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్త కన్నప్పను తీస్తున్నారు. తన కెరీర్‌లోనే గొప్ప సినిమా అవ్వాలన్న  ఉద్ధేశ్యంతోనే ఇంత బడ్జెట్‌ కేటాయించారు. భారీ తారాగణాన్ని సైతం రంగంలోకి దించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక, ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. మరి, భక్త కన్నప్ప మూవీపై మీ అంచనాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş